అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్క భారతీయుడి జేబులో నగదు వేస్తాను.. రాహుల్ గాంధీ…

 

 

నిన్న జరిగిన రాహుల్ గాంధీ బహిరంగ సభలో చెప్పిన మాటలివి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పేదలందరికీ కనీస ఆదాయ హామీ పథకం అమలు చేస్తాం అని రాహుల్ గాంధి అన్నారు. నిరవ్ మోదీని పట్టుకొచ్చి ఆ సొమ్మును ప్రజలకు పంచుతాం అని అన్నారు ఈ ప్రసంగం జరుగుతున్నంత సేపు రాహుల్ నరేంద్ర మోడీ ని విమర్శిస్తూనే వున్నారు మోడీ హయాంలో ప్రజలు చాల అవస్థలు పడుతున్నారని ఇతని హయాంలోనే అత్యధికంగా స్కామ్లు జరిగాయి అని అన్నారు. కెసిఆర్ మోడీ ఒక్కటే మోడీ చేతిలో కెసిఆర్ రిమోట్ లాంటివాడు అతను తానా అంటే ఇతను తందానా అంటాడు అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటో కూడా వీళ్ళకి తెలియటంలేదు. కాంగ్రెస్ పాలనలోకి వస్తే దేశ రక్షణ కోసం పోరాటం చేస్తాం అని అన్నారు. మొత్తం గా చుస్తే రాహుల్ గాంధీ మీటింగ్ చాలావరకు విజయవంతం అయిందనే చెప్పాలి।