3 . ఓ ఉంది కానీ రజిని ఉండడు అంటున్న శంకర్

 

rajinikanth,robo3.o,breaking newsరోబోకి సీక్వెల్ గా తెరకెక్కిన 2 .ఓ రిలీజ్ అయ్యి విశేషంగా ఆకట్టుకుంటుంది. శంకర్ విజువల్స్ , అక్షయ్ అప్పీరియన్స్ , రజిని చేసిన రచ్చ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి పడేస్తుంది. సినిమా చివర్లో రజిని బుల్లి రోబో చిన్ని గా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. 2 .ఓ కి సీక్వెల్ గా 3 .ఓ రానున్న సంగతి సినిమా చుసిన వారికీ అర్థమవుతుంది. కాకపోతే అది చిట్టిగా కాదు చిన్ని గా రానుంది. శంకర్ ప్రస్తుతం భారతీయుడు 2 సినిమా ని తెరకెక్కించే పనిలో బిజీ అయ్యాడు. ఇది కమల్ హాసన్ భారతీయుడికి సీక్వెల్ అన్న విషయం అందరికి తెలిసిందే. ఈ మూవీ కమల్ తో పాటు శింబు , దుల్కర్ సల్మాన్ నటించడం విశేషం.ఇప్పుడు శంకర్ దృష్టి మొత్తం ఇండియన్ సినిమా పైన ఉందంట. అది పూర్తి అవ్వగానే 3 .ఓ సినిమా రాస్త అని శంకర్ చెప్పాడు. ఒక ఇంటర్వ్యూ లో భాగంగా రోబో కి సీక్వెల్స్ వస్తూనే ఉండాలని శంకర్ చెప్పారు. 2 .ఓ సినిమా కి కల్లెక్షన్స్ అదిరిపోతున్నాయి. ఈ మూవీ కి లాంగ్ రన్ లో 1000 కోట్ల మార్క్ ను రజిని అధిగమిస్తాను ట్రేడ్ గట్టిగ నమ్ముతుంది. ఈ సినిమా ని ప్రొడ్యూస్ చేసిన లైకా ప్రొడక్షన్స్ కూడా సినిమా రెస్పాన్స్ పట్ల ఆనందం వక్తం చేశారట. ప్రస్తుతం శంకర్ తెరకెక్కిస్తున్న భారతీయుడు 2 మూవీ ని కూడా లైకా నే నిర్మిస్తుంది. దీని తరువాత వెంటనే 3 .ఓ ని కూడా ప్రొడ్యూస్ చేస్తారు. అయితే రోబో రెండు భాగాలలో ఎన్ని అబ్బురపరిచే గ్రాఫిక్స్ ఉన్నప్పటికీ రజిని మేజర్ ఎస్సెట్. కానీ 3 .ఓ చిత్రంలో రజిని ఉండడట. శంకర్ భారతీయుడు షూటింగ్ ముగించి విడుదల చేసే సరికి మరో రెండు సంవత్సరాలు పట్టడం ఖాయం. ఆ తరువాతే రోబో 3 .ఓ తెరకెక్కిది. అప్పటికి రజిని ఆరోగ్యము , బాడీ లాంగ్వేజ్ సహకరిస్తాయా అనే అనుమానాలు వెల్లడవుతున్నాయి. దీని బట్టి చూస్తే 3 . ఓ రజిని చేయడదేమో అని భావిస్తున్నారు.