పాపం రకుల్ పాప…దేవ్ దెబ్బకి ఏడుపు తప్పదు.

పాపం రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ ఆరంభంలో ఉన్నత జోరు ఇపుడు లేకుండా పోతుంది. ఒకప్పుడు ఇండస్ట్రీ లో అగ్ర హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ గా వెలిగి పోతోంది. అని అనుకుంటూ ఉండగా, ఈ మధ్య ఏమైందో ఏమో కానీ కాస్త సినిమా అవకాశాల పరంగా డౌన్ ఫాల్ లో ఉంది. తాజాగా ఆమె నటించిన ఏ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేక పోతున్నాయి.ఆ దెబ్బకు వచ్చే అవకాశాలు కాస్త చేజారి పోతున్నాయి. తమిళ నటుడు కార్తితో ఖాకీ తరవాత చేసిన దేవ్ తనకు మంచి బ్రేక్ గా నిలుస్తుంది అనుకుంటే అది ఏకంగా ఆ హీరో కెరీర్ లోనే వరస్ట్ మూవీగా నిలిచింది. సినిమా జయాపజయాలు తన వల్ల కాకపోయినా ఆ సినిమాల హిట్స్ మీదే తన తదుపరి ఆఫర్స్ ఉంటాయి.

తాజాగా దేవ్ సినిమా దెబ్బకు టాలీవుడ్ సంగతేమో కాని. తమిళంలో కూడా అవకాశాలు చేజారి పోయేలా ఉన్నాయి. ఇదిలా ఉండగా వెంకటేష్ నాగ చైతన్య కాంబోలో రూపొందబోయే వెంకీ మామలో చైతుకి జోడిగా తొలుత అనుకున్నది రకుల్ నే. అయితే తర్వాత ఏం జరిగిందో కాని ఫైనల్ గా ఆ సీటులోకి రాశి ఖన్నా వచ్చి కూర్చుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేస్తున్న రట్ససన్ రీమేక్ లో కూడా రకుల్ నే అడిగారట. సడన్ గా అనుపమ పరమేశ్వరన్ సీన్ లోకి వచ్చేసి ఆ ఛాన్స్ తీసేసుకుంది.

ఇప్పుడు విడిగా ఎవరైనా పిలుస్తారేమో అని చూస్తే దేవ్ ఫలితం దెబ్బకు మేనేజర్ కు కాల్స్ రావడం కూడా ఆగిపోయాయి. గతంలో దర్శకుడు హరీష్ శంకర్ దాగుడుమూతలు అనే కామెడీ మల్టీ స్టారర్ అనుకున్నప్పుడు ఒక హీరొయిన్ గా రకుల్ నే అనుకున్నారు. అయితే అది మొదలుకాకుండానే ఆగిపోయింది. హరీష్ శంకర్ దాన్ని వదిలేసి వరుణ్ తేజ్ తో వాల్మీకికి షిఫ్ట్ అయిపోయాడు. అయినా రకుల్ కి నో కాల్. సూర్యతో నంద గోపాల కృష్ణన్ చేసింది కాని అందులో తనకన్నా సాయి పల్లవి పాత్రకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందని ఇప్పటికే కోలీవుడ్ టాక్ ఉంది.ఈ లెక్కన చూస్తే ప్రస్తుతం రకుల్ బ్యాడ్ టైమ్ రన్ అవుతుందనే చెప్పాలి. అవకాశాలు రాకపోవడం వేరు వచ్చిన అవకాశాలు చేజారి పోవడం వేరు. ఈ సమయంలో రకుల్ కి కావలసింది ఒక సూపర్ హిట్ .ఆ హిట్ వస్తేనే కానీ…. రకుల్ కెరీర్ గాడి లో పడేలా లేదు. ఆ సమయం వస్తుందా, లేదా అన్నది ఇక పై చూడాలి.