‘నెటిజన్ల’తో పాటు వర్మ ట్విట్ : షాక్ లో కేఏ పాల్

 

ram gopal varma,ka paul

నేను మీ అందరిని కలవడానికి మీ ఊర్లకు వస్తాను అంటూ ‘ప్రజాశాంతి పార్టీ’ అధ్యక్షుడు కేఏ పాల్ పాటను పాడారు. గత వారంలో  నా జీవిత చరిత్రను బయోపిక్ తియ్యండి అంటూ వచ్చిన కేఏ పాల్, ప్రస్తుతం ఏపీ ఎన్నికలపై ద్రుష్టి పెట్టారు అందుకే సోది చెప్తా అన్నట్టు ఓ పాట పాడారు. అతను ప్రకాశం జిల్లాతో పాటు రాయలసీమలోనూ త్వరలో పర్యటిస్తానని ప్రకటించారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్ స్పందిస్తూ. ఏపీలో జగన్, చంద్రబాబుతోపాటు బీజేపీ, వంటి దుష్ట శక్తులు ఓడిపోతాయని పరిహాసాలు చేశారు కేఏ పాల్.

దింతో ‘మార్చిలో మార్పు, ఏప్రిల్ లో సునామీ, మనదే గెలుపు’ అని కొత్త వ్యాఖ్యలు చేసారు. ప్రజల పని ప్రజలు చేయాలనీ, దేవుడి పని దేవుడు చేస్తాడని వ్యాఖ్యానించారు. ఇందుకోసమే 50,000 మంది కోఆర్డినేటర్లను నియమించామని అన్నారు. కాగా కేఏ పాల్ ఓ పాటను పది పోస్ట్ చేసారు. దీన్ని ప్రముఖ వివాదాస్పద దర్శుకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో నవ్వుతున్న బొమ్మలతో పోస్ట్ చేసారు. దింతో రామ్ గోపాల్ వర్మ ఆఖరికి కేఏ పాల్ ని కూడా వొదలలేదు అని నెటిజన్లు కామెంట్లు కురిపించారు.