ఇక్కడ ఎవరో గుర్తుపట్టండి చూద్దాం… రామ్ గోపాల్ వర్మ ట్వీట్

ramgopal varma

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘ఎన్టీఆర్ బయోపిక్’ వ్యతిరేకంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తీస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి పాటలను విడుదల చేసాడు. అయితే సినిమాకు సంబందించి మొత్తం అన్ని పనులు పూర్తి చేసుకున్న వర్మ, ప్రస్తుతం ఖాళీ గా ఉన్నాడు దీంతో .. మొన్నటి వరుకు కెఏ పాల్ ను ట్విట్టర్ లో ఓ ఆట ఆడుకున్న సంగతి అందరికి తెలుసు. అయితే ప్రస్తుతం కూడా తన సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కు ప్రమోషన్స్ లో భాగంలో ట్విట్టర్ లో ఓ పజిల్ ఒదిలాడు ..

అదేంటంటే ఈ సినిమాపై అంచనాలను పెంచుతూ రోజుకో సన్నివేశాన్ని విడుదల చేస్తున్న వర్మ, నేడు మరో రెండు ఫొటోలను విడుదల చేశారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌’లో ఈ క్యారెక్టర్ ఎవరిది? అంటూ ఓ ఫొటోను, నాకు ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఇక్కడి వారంతా లక్ష్మీ పార్వతి కారణంగా అప్‌ సెట్ అయినట్టు కనిపిస్తున్నారంటూ మరో ఫొటోను పోస్ట్ చేశారు. ఒక చిత్రంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కొందరు, లక్ష్మీ పార్వతిని ప్రశ్నిస్తున్నట్టు కనిపిస్తుండగా, మరో చిత్రంలో ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన ఓ పాత్రధారి ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు కనిపిస్తోంది.