పవన్ కళ్యాణ్ కి నాదెండ్ల వెన్నుపోటు పొడుస్తారు : RGV

 

pawan kalyan,rgvప్రసుతం రామ్ గోపాల్ వర్మ “లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమాను తీస్తున్నారు. ఇప్పుడు వెన్నుపోటు అనే సాంగ్ ని రిలీజ్ చేసే పని లో ఉన్నారు , అయితే ప్రతి సారి ఎవరో ఒకర్ని గెలికి పబ్లిసిటీతెచ్చుకుంటాడు . “లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమా కి పెద్దగా పబ్లిసిటీ రావడం లేదని భాదపడుతున్నాడు .గతంలో.. తనకు అదే పనిగా పబ్లిసిటీ తెచ్చి పెట్టిన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ దగ్గరకు మళ్లీ వచ్చారు. అయితే… ఈ సారి పవన్ ను నేరుగా విమర్శించకుండా.. ఆయన పక్కనున్న వారిని టార్గెట్ చేసి… తనదైన శైలిలో సూచనలు, సలహాలిచ్చి హాట్ టాపిక్ అవుతున్నారు. తన లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమాలో ” వెన్నుపోటు” అనే పాటను రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ దాని గురించి పట్టించుకున్న వారు లేరు. అందుకే.. వెన్నుపోటు అనే అంశం ఏకంగా ఓ కథ రాసేశారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ఆయన తీసే సినిమా లోని వెన్నుపోటు లాగె, పవన్ కళ్యాణ్ ని నాదెండ్ల మనోహర్ వెన్నుపోటు పొడుస్తురని రామ్ గోపాల్ వర్మ చెప్తున్నారు ,ఆయన ఓ చిత్రమైన పోలిక తెచ్చారు. అప్పట్లో యన్.టి.ఆర్ పక్కన నిలబడి నాదెండ్ల మనోహర్ తండ్రి ఎలా అయితే నవ్వేవాడో.. ఇప్పుడు పవన్ పక్కన నాదెండ్ల మనోహర్ సేమ్ అలాగే నవ్వుతున్నారట. అయితే ఈ విషయం , జనసేన మరియు , నాదెండ్ల వర్గాల నుండి బయపడింది ఆయన చెప్తున్నారు , ఈ విషయం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంత సీరియస్ గా తీసుకుంటారో , వదిలేస్తారో చూడాలి.