పవన్ కళ్యాణ్ రియల్ స్టోరీ…

పవన్ కళ్యాణ్ అంటే ఒక ప్రభంజనం … పవన్ కళ్యాణ్ అంటే ఒక ధెర్యం, పవన్ కళ్యాణ్ అంటే శక్తి , ఏ కోణం లో ఐన పవన్ పేరు వినవినబడితే చాలు అభిమానుల ఆనందాలు అంత ఇంత కాదు . అసలు ఎక్కడి నుండి వచ్చింది ఈ ప్రస్తావన .. ఎక్కడ మొదలయింది ఈ పరుగు, ప్రజలకోసం జనసేన మొదటి సైనికుడిగా ఎలా అయ్యాడు , కొన్ని చరిత్రలు ఎన్ని సార్లు తెలుసుకున్న
ఇంకా తెలుసుకోవాలనే ఉంటుంది .. అటువంటి చరిత్రే కొణిదల కళ్యాణ్ బాబు ది….చిన్నతనంలో ఆస్తమా తో బాదపడ్డ బాలుడు ,
అందరిలా చలాకిగా కాకుండా డల్ ఉండేవాడు … ఎవరితోనూ పెద్దగా కలిసేవాడు కాదు .. ఒంటరిగా వుండే ప్రయత్నం చేసేవాడు

తల్లి అంజనాదేవి , తండ్రి వెంకట్రావు దంపతులకు మూడవ కొడుకు కళ్యాణ్ బాబు … వెంకట్రావు గారు ఓ పోలీస్ కానిస్టేబుల్ వృత్తి పరంగా అనేక ప్రాంతాలు తిరగవలసి వచ్చేది … దాంతో పవన్ కళ్యాణ్ కూడా రకరకాల ప్రాంతాల్లో పెరిగాడు . తండ్రి వెంకట్రావు గారు నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం …. పరపాటునకూడా లంచం తీసుకునేవాడు కాదు .. చాలి చాలని జీతం తో కుటుంబాన్ని నెగ్గుకు వచ్చేవారు.. ఒక్కో సారి కళ్యాణ్ కి వైద్యo చేయించడానికి కూడా ఇబ్బంది పడేవారు .. పవన్ చిన్నవాడే అయినా అన్ని అర్ధం ఐయేవి . నా వల్లే నా కుటుంబ సభ్యులకు ఇన్ని కష్టాలు నేనే లేకపోతె అని కుమిలి కుమిలి ఏడ్చే వాడు … ఆ ప్రభావం పవన్ చదువుమీద కూడా పడింది . పవన్ నెల్లూరులోని దర్గా మెట్ట ప్రాంతంలో సీన్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో హెల్త్ ప్రాబ్లెం వల్ల చదువుమీద అంతగా దృస్థి పెట్టలేకపోయేవాడు . అందువల్ల పదవతరగతి ఫెయిల్ అయ్యాడు . అది 1984 వ సంవత్సరం సరిగ్గా అదే
సమయంలో నాదెండ్ల భాస్కరరావు గారు ఎన్టీఆర్ ని గద్దె దించి ముఖమంత్రి అయ్యాడు నాదెండ్ల భాస్కరరావు గారు ఇచ్చిన 5 గ్రెస్ మార్కులతో పవన్ ఒడ్డున పడిపోయాడు .. తరువాత నెల్లూరులోని వి ఆర్ కాలేజీ లో ఇంటర్ మీడియట్ లో చేరాడు . కానీ అక్కడ పుస్తకాలలో వున్నది తలకి ఎక్కేది కాదు, ఆధాత్మిక పుస్తకాలూ , ఆటో భొయోగ్రఫీల పై ఎక్కువగా మనసు పెట్టేవాడు .

పరమహంస యోగానంద – ఓ యోగి ఆత్మ కద, గాంధీజీ – సత్య శోధన ,శేషేo ద్ర శర్మ – ఆధునిక మహాభారతం పవన్ని కదిలించాయి .
ఇక చేగోవిరా , రామకృష్ణ పరమహంస , వివేకానందుడు , రమణమహర్షి , బడేబాబా వంటి వారికీ పవన్ ప్రభావితం అయ్యాడు . అన్నికంటే ప్రధమంగా చేగువేరా పోరాట జీవితం పవన్ ని ఎంతగానో ప్రభావితం చేసింది… ఈమధ్యనే పవన్ కళ్యాణ్ చేగువేరా గురించి పవన్ ఏం రాశాడో మిరే వినండి .

ప్రపంచంలో అరాచకం , దోపిడీ , నిరంకుశత్వం ,ఉన్న వ్యవస్థల వల్ల ప్రజలు తీవ్ర బాధలు పడుతున్నప్పుడు నువ్వు ఆ దేశపు మనిషివి కానప్పటికీ… నీకు వ్యక్తిగతంగా ఏమి జరగనప్పటికీ … నువ్వు పెరిగిన దేశపు, సమాజపు హద్దులను చెరిపేసి ప్రపంచ పీడిత ప్రజలకి అండగా నిలబడాలి అని చెప్పిన వాడు … అంతే కాకుండా జీవితపు అంతిమ సమయం వరకు తాను నమ్మిన సిద్దాంతాన్ని నడచి చూపించిన విశ్వనరుడు ” చేగువేరా” .అందుకేనేమో దశాబ్దాల క్రితం ఎక్కడో దక్షణ అమెరికాలోని ఆర్జెంటినా లో పుట్టి పెరిగి క్యూబా , ఆఫ్రికా ,లాటిన్ , అమెరికా దేశాలలో పోరాటాలు చేసిన ” చేగువేరా” ఉత్తరాంధ్రలోని ఓ మూలకు విసిరేసినట్లుoడే ఇచ్ఛాపురం లో … స్వేచ్ఛ మాత గుడికి వెళ్లే వీధికి ఎదురుగా ఒక మాదిగ మహనీయుడు చెప్పుల దుకాణం పైన “విశ్వనరుడు “” చేగువేరా” ముఖ చిత్రం నాకు దార్శనిమిచ్చింది ..ఇది ట్వీట్ చుస్తే చాలు ” చేగువేరా” ప్రభావం పవన్ పైన ఎంతగాఉందో తెలుస్తోంది .. రమణ మహర్షి పుస్తకాలూ కూడా పవన్ పై చాలా ప్రభావాన్ని చూపించాయి . నిన్ను నువ్వు తెలుసుకో అంటాడు రమణమహర్షి . పవన్ కళ్యాణ్ దేవుని నమ్ముతాడు , కానీ పూజలు చెయ్యడు . జీవితంలో కష్టపడి చెయ్యడం కంటే పెద్ద దైవారాధన లేదని బలంగా నమ్ముతాడు .

పవన్ ఇంటర్ చదివే టైంకే చిరంజీవి గారు మంచి పేరు తెచ్చుకుని మెగాస్టార్ గా స్టార్ డం సంపాదించుకున్నారు .. దాంతో కాలేజీలో పవన్ సెలెబ్రెటీ అయిపోయాడు . అందరూ చిరంజీవి తమ్ముడుగా స్పెషల్ గా ట్రీట్ చేసేవాళ్ళు .
కానీ పవన్ కి మాత్రం సెలెబ్రెటీ హోదా నచ్చేదికాదు . సాదా సీదాగా వుంటూ పుస్తకాలు చదువుతూ లైబ్రేరిలో ఎక్కువ ఉండేవాడు .అన్నయ్య చిరంజీవి అంటే పంచప్రాణాలు , అన్నయ్య చిరంజీవిని ఎవరేమన్నా అంటే అసలు ఉరుకునేవాడు కాదు .. కోపంతో ఉగిపోయేవాడు . అక్కడినుండి దూరంగా వెళ్లి కాసేపు ఒంటరిగా గడిపేవాడు . అన్న మీద తనకి వున్నా కొండంత ప్రేమ ఇప్పటికి రవ్వంత కూడా తగ్గలేదు .చూస్తూ చూస్తూనే ఇంటర్ పరీక్షలు వచ్చేసాయి … పవన్ బుద్దిగా పరీక్ష రాస్తున్నాడు .. వెనుకనుండి ఎవరో సహా విద్యార్థి ఒక పేపర్ స్లీప్ ని పవన్ కి ఇచ్చాడు . పవన్ కి కాపీ కొట్టే అవకాశం వచ్చింది . కానీ పవన్ రెండు సెకండ్లు కళ్ళు మూసుకున్నాడు .

గాంధీజీ గారి సత్య శోధన పుస్తకంలో తాను చదివిన ప్రతి అక్షరం గుర్తుకు వచ్చింది . ఇదేనా నీ నిజాయితీ .. దీనికోసమేనా గంటలు తరబడి పుస్తకం చదివింది, అని తనని ఎవరో అన్నట్లు అనిపించింది. అంతే చేతిలోవున్న ఆ పేపర్ స్లీప్ నీ దూరంగా విసిరేసాడు.
ఎత్తిన తల దించకుండా వచ్చింది ఏదో రాసేసి బయటకి వచ్చేసాడు .పరీక్షలు అయిపోయాయి … సెలవులు వచ్చేసాయి..హాయ్ గా సినిమాలు చూస్తూ సినిమాలు చూస్తూ ఫ్రెండ్స్ తో జాలీగా గడుపుతూ సరదాగా టైం పాస్ చేయవచ్చు . కానీ అందరిలా ఆలోచిస్తే అతడు పవర్ స్టార్ ఎలా అవుతాడు .. ఒక ప్రింటింగ్ ప్రెస్ లో పనివాడిలా చేరాడు . సమయానికి మించి కస్టపడి మొదటిసారి సొంతంగా డబ్బు సంపాదించాడు .కోరినంత డబ్బు పంపించే అన్నయ్య ఉన్నాడు కానీ అలా అన్నయ్య దగ్గర నుండి ప్రతిసారి తీసుకోవడం ఎందుకు సొంతంగా సంపాదిస్తే కష్టం విలువ తెలుస్తుంది అనే సిద్ధాంతాన్ని నమ్మేవారు నిజానికి ఎంతో గొప్ప ఆలోచన. ఇంతలో రోజులు గడిచాయి సెలవులు అయిపోయాయి రిజల్ట్స్ వచ్చేసాయి పవన్ ఈ సారి కూడా ఫెయిల్ అయిపోయాడు. ఇంటికి వెళ్లాడు అమ్మానాన్న తిడతారో ఏమో అనుకున్నాడు కానీ వాళ్ళ అసలు ఏమీ అనలేదు అన్నయ్య తిడతాడేమో అనుకున్నాను కానీ అసలు చిరంజీవి గారు ఆ విషయాన్ని అడగలేదు. కనీసం ఇంట్లో వాళ్ళు ఏమన్నా అంటే బాగుండేది. కొంతసమయం బాధపడి వదిలేసేవాడు. కానీఎవరు ఏమి అనయపోయేసరికి తనలో అపరాధ భావం పెరిగిపోయింది.

ఒకపక్క సచిన్ టెండుల్కర్ విశ్వనాథన్ ఆనంద్ వయసుకి మించిన ప్రతిభ చూపిస్తున్నారు.
నేనేమో ఇంటర్ కూడా పాస్ కాలేకపోతున్నాను ఎందుకు నేను బ్రతికి ఎవరిని ఉద్ధరించడానికి అని ఆత్మహత్య చేసుకోబోయాడు కొద్దిగా ఆలస్యం అయితే ప్రాణాలు కూడా పోయేవి, అంతలో కుటుంబ సభ్యులు సమయానికి గమనించి పవన్ ని కాపాడుకున్నారు. ఆ రోజు రాత్రి ఇంట్లో అంతా ఎవరు మాట్లాడుకోలేదు, అన్నయ్య చిరంజీవి నాగబాబు పవన్ పక్కనే రాత్రంతా ఉన్నారు అప్పుడు చిరంజీవి గారు పవన్ ని దగ్గరికి తీసుకుని ఒక మాట చెప్పారు, తమ్ముడు చదువుకుంటే జీవితం కాదు. సచిన్ టెండుల్కర్ కు పేరు వచింది డిగ్రీలు చూసి కాదు క్రికెట్లో అతని ఆట చూసి . విశ్వనాథన్ ఆనంద్ పేరు వచ్చింది చెస్ లో అతని ప్రతిభ చూసి. అలాగే నీకు ఏ రంగం అంటే ఇష్టమో గుర్తించు. ఆ రంగంలో నిరంతరం శ్రమించు. తప్పక విజయం సాధిస్తావు.. మేమంతా నీ ప్రతి అడుగులో అండగా ఉంటామని ధైర్యాన్ని నూరిపోశారు. తమ్ముడికి మరలా జీవితం పై నమ్మకం కలగడానికి అన్నయ్య నాగబాబు సిటీలో ఉన్న అన్ని బుక్ షాప్ లు తిరిగి ఒక బుక్ తీసుకొచ్చి ఇచ్చాడు . అందులో వెయ్యి మంది జివితాలో సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి.

1000 మంది జీవితాలు… 1000సక్సెస్ స్టోరీస్ . ఆ బుక్ చదువుతునంత సేపు పవన్ కి ఏదో తెలియని కొత్త ప్రపంచంలో కి అడుగు పెట్టినట్లు అనిపించింది. ముఖ్యంగా లియోనాడో ద్రవించి భాహుముక ప్రతిభ ఎంతగానో ఆకట్టుకుంది ఒక వ్యక్తికి ఇన్ని రంగాలపై పట్టు ఎలా అని ఆశ్చర్యపోయాడు. అప్పటి నుండి తను వాళ్ళలా జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్నా నిర్ణయించుకున్నాడు అయితే నిర్ణియం ఒక్కటే ఉంటే సరిపోదు పట్టుదల కూడా ఉండాలి.కానీ పవన్ కి ఏ పనిలోనూ దృష్టి నిలవడం లేదు కొద్దిరోజులు దేశమంతా తిరిగిన పారఙ్గలిడింగ్ నేర్చుకున్నాడు, కొన్ని రోజులకు మధ్యలోనే వదిలేసి కర్ణాటక సంగీతం క్లాస్ కి వెళ్ళాడు, అది కాదని వదిలేశాడు కొన్ని రోజులు డ్రాయింగ్ ప్రాక్టీస్ చేశాడు, మరికొన్ని రోజులు ఫారిన్ భాషలు నేర్చుకునే ప్రయత్నం చేశాడు, ఇవన్నీ కాదని కంప్యూటర్ ప్రోగ్రామ్ కి వెళ్ళాడు ఇలా మూడు సంవత్సరాల్లో 30కి పైగా రంగాల్లో ట్రై చేశాడు .ఎందులోనూ సంతృప్తి చెందలేదు లైఫ్ లో సెటిల్ అవ్వలేదు అని భయం పట్టుకుంది విపరీతమైన మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఒత్తిడి నుండి బయటకు రావడానికి వీడియో రికార్డర్లులో సినిమాలు చూడటం మొదలు పెట్టాడు. కాస్సెట్స్ అయితే ఐపోతునై కానీ పవన్ బుర్ర లో నుండి లైఫ్ మిద క్లారిటీ మాత్రం రావడం లేదు.

ఒకసారి చిరంజీవిగారు రూమ్ లోకి వచ్చారు వీడియోలు చూసి చూసి వీడియో రికార్డులో హెడ్లు అరిగిఅయిపోతుంది కానీ నీది హెడ్ లో నుండి ఒక్క ఐడియా కూడా బయటకి రావట్లేదు ఏంటి అని మందలించారు.తమ్ముడు పరిస్థితి చూసి చిరంజీవి గారు చాలా బాధపడే వారు కానీ బయటకు తెలియకుండా మేనేజ్ చేసేవారు. ఓ సారి పవన్ కళ్యాణ్ అన్న వదిన దగ్గరికి వచ్చారు. అన్నయ్య నేను ఏం చెయ్యాలో తేల్చుకోలేక పోతున్నాను . మీరే ఏదైనా సలహా ఇవ్వండి అని అడిగాడు అప్పుడు అన్నయ్య చిరంజీవి గారు, వదిన సురేఖమ్మ ఒకే మాట చెప్పారు నువ్వు సినిమాలో నటించు, పెద్ద స్టార్ అవుతావు అన్నారు కానీ పవన్ కి చిన్నతనం నుండే చాలా బిడియం ఎక్కువ , అన్నయ్య నేను పదిమంది ముందు నటించలేను, డాన్సులు చేయలేను కావాలంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పని చేస్తాను అని చెప్పాడు. వేరొకరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేయడానికి చిరంజీవి గారు ఒప్పుకోలేదు నువ్వు కచ్చితంగా ఆక్టర్ కావాలని గట్టిగా చెప్పారుఅన్నయ్య సలహాను గౌరవించి పవన్ ఆక్ట్ చేయడానికి ఒప్పుకున్నాడు వెంటనే చిరంజీవి గారు వైజాగ్ లోని సత్యానంద్ గారికి ఫోన్ చేసి మీరు నా తమ్ముడుకి యాక్టింగ్ లో శిక్షణ ఇవ్వాలని కోరారు అప్పటికి సత్యనంద్ గారికి తెలియదు చిరంజీవి గారికి నాగబాబు కాకుండా మరో తమ్ముడు ఉన్నాడని సరే పంపించండి అన్నయ్య అన్నాడు. పవన్ కళ్యాణ్ సత్యానంద్ ఆక్టింగ్ స్కూల్లో చేరాడు పవన్ తన ఆధ్యాత్మిక లోకం నుండి ఈ రంగురంగుల సినీ లోకానికి తెలియని అడుగులు వేస్తూ వచ్చాడు .సినిమా లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా ఎలా పేరు తెచ్చుకున్నాడో… పార్ట్ 2 లో తెలుసుకుందాం.