టీడీపీని టీఆర్ఎస్ టార్గెట్ చెయ్యటానికి కారణం అదే

tdp - trs, Telugu Vilas

టీడీపీని టీఆర్ఎస్ టార్గెట్ చెయ్యటానికి కారణం అదే

ఏపీలో ప్రతిపక్ష నేత మీద దాడి జరిగితే దాడిని ఖండించటం వరకు బాగానే వుంది కానీ ఇదే అదునుగా టీఆర్ఎస్ నేతలు చంద్రబాబుపై మాటల దాడి ఎందుకు చేస్తున్నట్టు అని ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆలోచనలో పడ్డారు. శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్టు చంద్రబాబు కి ప్రధాన ప్రత్యర్ధి ఏపీలో జగన్ అయితే తెలంగాణాలో కేసీఆర్ కాబట్టి జగన్ మీద జరిగిన దాడికి ఇంతగా మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ నేతలు. చంద్రబాబు తెలంగాణాలో పోటీ చెయ్యకుండా శత విధాలా ప్రయత్నించిన టీఆర్ఎస్ ఇప్పుడు చంద్రబాబు ని విమర్శించే అస్త్రాల కోసం చూస్తుంది. ఈ నేపధ్యంలో జగన్ పై జరిగిన దాడి అంశాన్ని కూడా వాడుకుని బాబుపై విమర్శనాస్త్రాలు వాడుతుంది.

trs-Party,kcr

See More :జగన్ పై దాడి చేసిన యువకుడి పేరు… వివరాలు ఇదిగో…

అందులో భాగంగానే టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టీఆర్ఎస్ నేత తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. విశాఖ విమానాశ్రయంలో దాడికి గురై హైదరాబాద్ సిటీ న్యూరో సెంటర్‌లో చికిత్స పొందుతున్న వైసీపీ అధినేత వైఎస్‌.జగన్మోహన్ రెడ్డిని పరామర్శించిన ఆయన చంద్రబాబు ప్రతి దానిని రాజకీయం చేస్తూనే ఉన్నారని.. దాడి సంఘటనను ఒక ఎపిసోడ్‌లా క్రియేట్ చేసి డ్రామాలు ఆడుతున్నారంటూ తలసాని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీని డ్రామా కంపెనీ అని పోల్చిన తలసాని.. మీ డ్రామా కంపెనీలో తాను 30 ఏళ్లు ఉన్నానని.. చాలా డ్రామాలు చూశానంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. ప్రతిపక్షనేతపై దాడి జరిగితే గవర్నర్.. డీజీపీకి ఫోన్ చేసి వివరాలు అడిగితే తప్పా అని ఆయన ప్రశ్నించారు. పార్టీలు వేరైనా తామంతా ప్రజాస్వామ్యంలో కలిసే పనిచేస్తున్నామన్నారు. మానవతా దృక్పథంతోనే కేసీఆర్, కేటీఆర్, కవిత .. జగన్‌ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారని చెప్పిన తలసాని డ్రామాలు అక్కడ నడుస్తాయేమో కానీ.. ఇక్కడ అలాంటివి కుదరదని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.

Jagan-attack Image,Jagan Images

ప్రతిపక్షనేతపై దాడి జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని.. ఆనాడు అలిపిరిలో మీపై దాడి జరిగితే నాడు ప్రతిపక్ష పార్టీలన్నీ ఖండించాయని గుర్తు చేశారు. మనుషుల ప్రాణాలు పోయినా మేం రాజకీయాలు చేస్తామంటే ప్రజలంతా గమనిస్తున్నారని తలసాని చాలా ఘాటుగా స్పందించారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో ముందస్తు ఎన్నికలు దగ్గర పడిన సమయంలో జగన్ ను తెలంగాణా ఎన్నికలకు ప్రచారాస్త్రం గా వాడుకునే ఆలోచనలో ఉన్న టీఆర్ఎస్ జగన్ పై జరిగిన దాడి పట్ల ఇంతగా రియాక్ అవుతుందని రాజకీయ వర్గాల భావన. ఎన్నికల సమయం కాకపోతే ఈ ఇష్యూకి ఇంత మైలేజ్ వచ్చేది కాదేమో.. ఎవరు ఏం చేసినా ఎక్కడ ఏమి జరిగినా ఇప్పుడంతా ఓటు బ్యాంకు రాజకీయమే ..

            టీడీపీని టీఆర్ఎస్ టార్గెట్ చెయ్యటానికి కారణం అదే

Related Posts: — 

జగన్ పై దాడి అనంతరం ట్వీటర్ లో స్పందించిన నారా లోకేష్ …!

జగన్ ను పొడిచిన కత్తికి విషం పూసి ఉంటే ఏంటి పరిస్థితి?: రోజా ఆందోళన

సినీనటి రేవతి టీడీపీలో చేరిక వెనుక పెద్ద ప్లానే ఉంది …!