‘రిపబ్లిక్ టీవీ సర్వే’ 19ఎంపీ సీట్లు ‘వైసీపీ’కే

 

ys jagan,ysrcp

ఇంతలో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో వైస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో టీడీపీకి కేవలం ఆరు ఎంపీ సీట్లు మాత్రమే వస్తాయని ‘రిపబ్లిక్‌ టీవీ’ నిర్వహించిన ఓ సర్వే లో తేలింది. వైసీపీ అత్యధిక ఎంపీ సీట్లను నెగ్గి గణ విజయం సాధిస్తుంది అని ఆ సర్వేలో తేలింది. ‘నేషనల్‌ అప్రూవల్‌ రేటింగ్స్‌’ పేరుతో జరిగిన ఈ సర్వే ఫలితాలను రిపబ్లిక్‌ టీవీ నిన్న ప్రకటించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో ఉన్నమొత్తం 25 లోక్‌సభ సీట్లకు గాను వైసీపీకి 19 ఎంపీ సీట్లు వస్తాయని. టీడీపీకి కేవలం ఆరు సీట్లు మాత్రమే వస్తాయని సర్వే అంచనా వేసింది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు ఏపీలో ఒక్క స్థానంలో కూడా గెలవలేవని చెప్పారు.

ఓట్ల శాతం పరంగా చూసినా కూడా సర్వేలో వైసీపీదే ముందుంది. వైసీపీకి 43.3 శాతం ఓట్లు, టీడీపీకి 30.1 శాతం మాత్రమే ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్లు సర్వే వెల్లడించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసినా ఏపీలో టీడీపీకి 15 ఎంపీ సీట్లు మాత్రమే లభించడం గమనార్హం. బీజేపీకి రెండు ఎంపీ సీట్లు రావడం తెలిసిందే. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ 8 ఎంపీ సీట్లను సాధించింది. సీ ఓటర్‌ సంస్థ గతంలో వెల్లడించిన సర్వేలో కూడా వైసీపీ ఘన విజయం సాధిస్తుందని అంచనా వేసిన సంగతి అందరికి తెలిసిందే. మరి ఇవికూడా లగాటపాటి సెర్వేల్లా నిజం అవుతాయేమో చూడాలి…