బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న రేవంత్ రెడ్డి

revanth reddy joins bjp

తెలంగాణ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ లోకి వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ విషయమై ఢిల్లీలో చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తుంది మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన రేవంత్ రెడ్డి సంచలన విజయం సాధించాడు అలాగే భువనగిరి పార్లమెంట్ స్థానం నుండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీచేసి గెలుపొందాడు ఇక అలాగే రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా బీజేపీ లోకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది

ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ సీఎం కెసిఆర్ ను నిలువరించాలంటే కాంగ్రెస్ పార్టీ వల్ల ఏ మాత్రం కాదని రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీ వైపు చూస్తున్నట్లుగా అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ విషయం మేరకు బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తో ఢిల్లీలో చర్చలు జరిగినట్లుగా తెలుస్తుంది బీజేపీ ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉండటం అలాగే తెలంగాణలోని 4 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించడంతో రేవంత్ రెడ్డి మరియు కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీ వైపు చుస్తున్నారంట

 

revanth reddy joins bjp