డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఇంట్లో దొంగ తనం.

విలక్షణ నటుడు మోహన్ బాబు ఇంటిలో చోరీ జరిగింది. హైదరాబాద్ లోని తమ ఇంటిలో నగదు, ఆభరణాలు చోరీకి గురైనట్లు మోహన్ బాబు మేనేజర్ ఈరోజు పోలీసులను కంప్లేట్ ఇచ్చాడు. ఆ మేరకు పోలీసులు విచారణ సాగిస్తున్నారు.ఇందుకు సంబంధించిన వివరాల మేరకు లక్షల రూపాయల నగదుతో పాటు నగలు దొంగతనానికి గురయ్యాయనీ తెలుస్తుంది. ఈ విషయంలో తమకు పనిమనిషి మీదే అనుమానం ఉందని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు లో పేర్కొన్నారు.దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కాగా, ఈ కేసు విషయంలో దర్యాప్తు ప్రారంభించామని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుని నగదు, ఆభరణాలను రికవరీ చేస్తామన్నారు.