రోజా షాకింగ్ కామెంట్ .. జగన్ పై హత్యాయత్నం పక్కా బాబు ప్లాన్

Roja, Telugu Vilas

రోజా షాకింగ్ కామెంట్ .. జగన్ పై హత్యాయత్నం పక్కా బాబు ప్లాన్

వైసీపీ ఎమ్మెల్యే రోజా ఏపీ సీఎం చంద్రబాబు పై, టీడీపీ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పై హత్యా ప్రయత్నం ముమ్మాటికీ చంద్రబాబు యొక్క ప్లానే అని వైసీపీ ఎమ్మెల్యే రోజా బల్ల గుద్దిమరీ చెప్తున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత చంద్రబాబుకి ఎదురు లేదు అనుకున్న సమయంలో జగన్ వచ్చే సరికి బాబు జగన్ ను ఎలాగైనా తొక్కేయాలని చూశారన్నారు రోజా . అందుకు ఆయన మీద తప్పుడు కేసులు బనాయించారని మండిపడ్డారు ఇప్పుడు కూడా అలాగే తన రాజాకీయ జీవితానికి అడ్డు వస్తున్నాడనే జగన్ పై ఎన్నో నెలల నుంచి పక్కా ప్లాన్ ప్రకారమే హత్యా యత్నానికి పాల్పడ్డారని రోజా ఆరోపణలు చేశారు.

Image result for roja political posts

గత నెల జగన్ పై శ్రీనివాసరావు అనే యువకుడు జగన్ పై కోడి కత్తితో దాడికి పాల్పడి సృష్టించిన సంచలనం ఇప్పుడు వైసీపీ , టీడీపీ ల మాటల యుద్ధానికి తెరలేపింది. మొన్న శివాజీ టార్గెట్ గా చెలరేగిన వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇప్పుడు చంద్రబాబే టార్గెట్ గా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ విషయంలో రోజా మాత్రం అస్సలు తగ్గడం లేదు.జగన్ పై హత్యా యత్నంలో టీడీపీ నుంచి పెద్ద కుట్రే జరిగిందని కొన్ని షాకింగ్ విషయాలను వెల్లడించారు నగరి ఎమ్మెల్యే రోజా.దాడి జరిగిన మొదట్లోనే డీజీపీ మరియు టీడీపీ యొక్క మంత్రులు మాట్లాడిన తీరును బట్టే దీని వెనుక చాలా పెద్ద కుట్రే దాగి ఉందని అర్ధమవుతుందని చెప్పారు రోజా. శ్రీనివాస్ అనే వ్యక్తిని పనిలో పెట్టుకున్నటువంటి వ్యక్తి హర్షవర్ధన్ చౌదరి టీడీపీకి చెందిన వ్యక్తి అని చెప్పిన రోజా జనవరి నెల నుంచే వారి రెస్టారెంట్ లో కోడి కత్తులు దాచి ఉంచడం,అతని రెస్టారెంట్ ఓపెనింగ్ కూడా నారా లోకేష్ తోనే చెయ్యించడం దీన్ని బట్టే మనం అర్ధం చేసుకోవచ్చు జగన్ పై హత్యకు వారు కుట్ర చేశారని రోజా అంతా తానూ చూసినట్టు ఇన్వెస్టిగేట్ చేసినట్టు చెప్పటంటీడీపీ నాయకులకు ఒళ్ళు మండిస్తుంది. ఏపీలో చర్చకు దారి తీస్తుంది.

Related Posts: —

TRS కి పవన్ కళ్యాణ్ మద్దతు …!

తెరాస నేతల వింత చేష్టలు …!

జగన్మోహన్ రెడ్డి కాదు… జగన్ మోదీ రెడ్డి : నారా లోకేష్ …!

బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ, జగన్ పార్టీ, పవన్ కల్యాణ్ పార్టీ : నారా లోకేష్

మహాకూటమి పార్టీ నేత అంత పని చేశాడా ? అందుకేనా ఈ లొల్లి