నిర్మాతగా రాజమౌళి తనయుడు

Rajamouli RRR Movie, Telugu Vilas

నిర్మాతగా రాజమౌళి తనయుడు

సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం సర్వ సాధారణం అయిపోయింది. కానీ కొందరు మాత్రం హీరోలుగా కాకుండా వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ దర్శకుడిగా.. నిర్మాతగా అడుగులు వెయ్యటానికి ఇష్టపడుతున్నారు. కానీ అలంటి స్టార్ కిడ్స్ సంఖ్యను వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు. ఇప్పుడు ఆ లిస్టులో SS రాజమౌళి తనయుడు కార్తికేయ కూడా చేరాడు.

కార్తికేయ గతంలో ‘యుద్ధం శరణం’ కు లైన్ ప్రొడ్యూసర్ గా వ్యహరించాడు. అంతే కాకుండా అయన తండ్రి రాజమౌళి తీసిన బాహుబలి ప్రొడక్షన్ సమయంలో సెకండ్ యూనిట్ ప్రొడ్యూసర్ గా హ్యాండిల్ చేయడం కూడా జరిగింది కాబట్టి మంచి అనుభవం ఉన్నట్టే. దీనికి తోడు రాజమౌళి ఫ్యామిలీ అంతా సినిమా పరిశ్రమకు అంకితమైన వారే కాబట్టి సపోర్ట్ కూడా భారీగానే ఉంటుంది. త్వరలో కార్తికేయ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు వెల్లడవుతాయి.

Image result for karthikeya rajamouli son

మొదట్లో అంత కార్తికేయ కూడా రాజమౌళిలాగా దర్శకత్వం చేస్తాడని అందరూ ఊహించారు. తాజా సమాచారం ప్రకారం కార్తికేయ నిర్మాతగా మారుతున్నాడట. నిర్మాతగా మారాలన్న తన కోరికను తల్లిదండ్రులకు చెప్పడం.. వారు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగి పోయాయట.సో , త్వరలో కార్తికేయ కొత్త బ్యానర్ స్థాపించి సినిమాల నిర్మాణం మొదలు పెట్టనున్నాడు. కార్తికేయ నిర్మించనున్న మొదటి సినిమాకు గంగరాజు అశ్విన్ దర్శకత్వం వహిస్తాడట. అశ్విన్ కు గతంలో ‘ఈగ.. ‘బాహుబలి’ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అనుభవం ఉంది. పీరియడ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘ఆకాశవాణి’ అనే టైటిల్ అనుకుంటున్నారట.

Related Posts: —

హాల్ చల్ చేస్తున్న ఇలియానా ..!

తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ఊచకోత…!

‘ఆర్ఆర్ఆర్’ ప్రారంభోత్సవంలో ప్రభాస్ ?

ఉపాసన రిక్వెస్ట్…. వెయిట్ చేయాలన్న కేటీఆర్!

టాలీవుడ్ కి అందాల ‘నిధి’