400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న RRR సినిమా … రాజమౌళి RRR Movie Updates

RRR MOVIE PRESS MEET HYDERABAD

RRR MOVIE PRESS MEET HYDERABAD

బాహుబలికి మించిన బడ్జెట్ తో సినిమా తెరకెక్కిస్తున్న రాజమౌళి సుమారు 400 కోట్ల బడ్జెట్ తో సినిమా తీస్తున్నామని నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో అయన చెప్పారు. DVV ప్రొడక్షన్స్ బ్యానర్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. విలేకరులు అడిగిన కొన్ని ప్రశ్నలకు అయన సమాదానాలు ఇచ్చారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో జూనియర్ ఎన్టీఆర్ మరియు రాంచరమ్ నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే అయితే కథ ఏంటి సినిమాలో హీరోల పాత్రల విషయంలో చాల ఊహాగానాలే వినిపించాయి అయితే వాటిని పటాపంచలు చేస్తూ రాజమౌళి గారు సినిమా అసలు కథ ఏంటి అనే విషయాలు వెల్లడించారు. సినిమా కథ పరంగా చూస్తే అల్లూరి సీతారామ రాజు గారు మరియు కొమరం భీం గారి చెరిత్ర ఆధారంగా సినిమా తీస్తున్నారు ఇందులో సీతారామ రాజు గా రామ్ చరణ్ మరియు కొమ్మరం భీం గా జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నారని అయన వెల్లడించారు. వారి జీవితం లో కొన్ని యదార్ధ సంఘటనలని ఇందులో చూపిస్తున్నాం అని అన్నారు.

రాంచరణ్ తో కలిసి సినిమా చేయటం చాల ఆనందంగా ఉందని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు మేము ఇద్దరం చాల మంచి స్నేహితులం అని అయన చెప్పుకొచ్చారు.

అలాగే రాంచరణ్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నందుకు చాల ఆనందంగా ఉందన్నారు
రాజమౌళికి థాంక్స్ చేప్తున్న. ఎన్టీఆర్ నాకు చాల సన్నిహితుడు మా స్నేహం ఇలాగె ఉండాలని కోరుకుంటున్న అని అయన అన్నారు.

ఇక విజువల్ ఎఫెక్ట్ , గ్రాఫిక్స్ గురించి రాజమౌళి ఇలా అన్నారు గ్రాఫిక్స్ తో సినిమా చెయ్యకూడదని అనుకున్న కానీ కుక్క తోక వొంకరలాగా అవిలేకుండా చేయలేకపోతున్న. ఇక విలేకరులు అడిగిన ప్రశ్నకు మహాభారతం నాకు చివరి సినిమా కావచ్చు అని చెప్పారు.

 

See also: 

RRR MOVIE PRESS MEET HYDERABAD