చాలాయేళ్ల తరువాత మెగాఫోన్ పట్టనున్న దర్శకుడు….

ఈ దర్శకుడి పేరువింటే మనకు మరపురాని మంచి కథాంశం వున్న సినిమాలే గుర్తుకొస్తాయి. ఈ దర్శక ధీరుడు తెరకెక్కించిన శుభ లగ్నం , మావిచిగురు, రాజేంద్రుడు గజేంద్రుడు, ఎగిరే పావురమా, యమలీల, మొత్తంగా చాలా సినిమాలే ఉన్నాయ్  చాలావరకు సూపర్ డూపర్ హిట్ సినిమాలే. ఇతని సినిమాలో కథ , స్క్రీన్ ప్లే , సంగీతం & దర్శకత్వం అన్ని తానే మరి మనం ఎవ్వరి గురించి మాట్లాడుతున్నామో తెలుసా అదేనండి మన ఎస్ వీ కృష్ణా రెడ్డి గురుంచి.

ఈ దర్శకుడు 2014 తరువాత అసలు సినిమాలే చేయలేదు దానికి కారణాలు అనేకం ఇప్పుడు ఈయన మరోసారి దర్శకత్వం వహించబోతున్నారు। ఐతే కొత్త సినిమా విశేషాలు ఇంకా తెలియాల్సి వుంది। అయితే ఇతను పాత పద్దతిలో సినిమా తీస్తారా లేదా ప్రస్తుత ట్రెండ్ కి అనుగుణంగా సినిమా తీస్తారా చూడాలి।

అల్ ది బెస్ట్ ఎస్ వీ కృష్ణా రెడ్డి గారు।