అమితాబ్ మోషన్ టీజర్ రిలీజ్ చేసిన సైరా టీం…!

amitab, Telugu Vilas

Saira Narasimhareddy Team Released Amitab Motion Poster: — ఈ రోజు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ పుట్టనరోజు. బాలీవుడ్ లో నటించే అమితాబ్ తాజాగా టాలీవుడ్ లో మెగా స్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్నాడు. అయన పుట్టినరోజు సందర్భగా ఈ చిత్రంలోని అమితాబ్ మోషన్ టీజర్ ని విడుదల చేసారు చిత్ర యూనిట్. ఇప్పడు ఈ పోస్టర్ తో ఈ సినిమాపై బారి అంచనాలు నమోదయ్యాయి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు పాత్రలో అమితాబ్ నటిస్తున్నాడు . గెస్ట్ పాత్రే అయినప్పటికీ నరసింహారెడ్డి గురువు పాత్ర కావడంతో పాటుగా చిరంజీవి తో ఉన్న అనుబంధంతో ఆ పాత్రని చేయడానికి అంగీకరించాడు అమితాబ్.

Sye Raa, Telugu Vilas

Also Read: — Aravinda Sametha Movie Public Talk | Public Review

కొణిదల ప్రొడక్షన్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు , తమిళ , హిందీ , బాషలలో భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తో పాటు , జగపతిబాబు , అమితాబ్ , విజయ్ సేతుపతి , నయనతార తదితరులు ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్రం యూనిట్.

Chiru, Telugu Vilas

Also Read: — నెత్తుటి కత్తిని తొడకి తుడవడం కొత్త పద్ధతి .. ‘ సూపర్ త్రివిక్రమ్ అంటున్న ఫ్యాన్స్!