మిలిటరీ ఆఫీసర్ గా అలరించనున్న మహేష్ బాబు

sarileru neekevvaru mahesh babu shooting

మిలిటరీ ఆఫీసర్ గా అలరించనున్న మహేష్ బాబు

sarileru neekevvaru mahesh babu shooting

మహర్షి మూవీ బారీ బ్లాక్ బస్టర్ తరువాత ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న మూవీ “సరిలేరు నీకెవ్వరు” మహర్షి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఆనందాన్ని ఆస్వాదిస్తూనే హాలిడే ట్రిప్ కి విదేశాలకు వెళ్లిన మహేష్ బాబు ప్రస్తుతం ఇండియా మ్యాచ్ లు చూస్తూనే ఎంజాయ్ చేస్తున్నాడు అక్కడి నుంచి ఇండియాకి రాగానే అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ లో పాల్గొంటారు

హీరో లేకుండానే పూజా కార్యక్రమాలను పూర్తి చేసిన మూవీ టీం ప్రస్తుతం ప్రిన్స్ కోసం వెయిటింగ్ లో ఉంది ఈ కథ ప్రకారం మహేష్ ఇందులో మిలిటరీ ఆఫీసర్ గా కనిపిస్తాడు ముందుగా ఈ సినిమా యొక్క షూటింగ్ షెడ్యూల్ కాశ్మీర్ లో ప్లాన్ చేశారు

sarileru neekevvaru mahesh babu shooting ఈ మూవీ లో మహేష్ బాబు మిలిటరీ ఆఫీసర్ కనుక ఆ పాత్రకి సంబందించిన కొన్ని సన్నివేశాలు మొదటిగా అక్కడ షూట్ చేస్తారు తిరిగి హైదరాబాద్ వచ్చాక ఇక్కడి పార్ట్ షూటింగ్ మొదలవుతుంది కొన్ని రోజులయ్యాక నేరుగా రాయలసీమకి మూవీ యూనిట్ షిఫ్ట్ అయిపోతారు ఈ మూవీకి సంబందించిన ముఖ్య భాగం షూటింగ్ అంతా అక్కడే ఉంటుంది అని వినికిడి ఈ ఏడాదిలో ఆరు నెలలు గడిచిపోయాయి ఇంకా మిగిలి ఉన్న 180 రోజుల్లో పాటలతో సహా మూవీ షూటింగ్ కూడా కంప్లీట్ చేసి డిసెంబర్ కల్లా మూవీ యొక్క ఫస్ట్ కాపీ చెయ్యాలని టీం ఆతృతగా ఉంది

దర్శకుడు అనిల్ రావిపూడి కూడా దానికి తగ్గట్టే పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది అప్పుడే సంక్రాంతి రేస్ కి సరిలేరు నీకెవ్వరు సిద్ధం అవుతుంది ఈ మూవీ కి హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుంది మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ మూవీలో చాలా ఏళ్ళ తరువాత విజయ శాంతి రీఎంట్రీ ఇస్తుంది ఇదే ఈ మూవీ కి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది

sarileru neekevvaru mahesh babu shooting

మరియు సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఈమూవీ కి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు అలాగే త్వరలోనే ఈ మూవీ ట్యూన్స్ ని కంపోజ్ చెయ్యడం ప్రారంభం కానుంది మొత్తానికి మహర్షి తర్వాత రానున్న ఈ మూవీపై ఫాన్స్ కి బారీ అంచనాలే ఉన్నాయి కాబట్టి ఈ మూవీ మహర్షి కంటే ఎక్కువ స్థాయిలో వసూళ్లు రాబడుతుందో లేదో చూడాలి మరి

 

sarileru neekevvaru mahesh babu shooting

Saaho Teaser