ప‌డ‌వ బోల్తా ఘ‌ట‌న : ప్ర‌మాదం ముందు.. ప్ర‌మాదం త‌రువాత..!

క‌చ్చులూరు ద‌గ్గ‌ర గోదావ‌రిలో మునిగిపోయిన రాయ‌ల్ వ‌శిష్ట బోటును వెలికి తీశారు. ధ‌ర్మాడి స‌త్యం బృందంతోపాటు స్కుబా డ్రైవ‌ర్లు తీవ్రంగా కృషిచేసి దాన్ని బ‌య‌ట‌కు తీశారు. నీటి అడుగుభాగం నుంచి రోప్‌ల సాయంతో బోటును వెలికి తీశారు. దీంతో బాధిత కుటుంబ స‌భ్యుల్లో ఉత్కంఠ నెల‌కొంది. మృత దేహాలు ఎలాంటి స్థితిలో ఉన్నాయి..? ఎన్ని డెడ్‌బాడీస్ ఉన్నాయి..? కాసేప‌ట్లో గుర్తించనున్నారు.

గోదావ‌రిలోని ప‌డ‌వ శ‌క‌లాల‌న్నింటిని బ‌య‌ట‌కు తీసేందుకు స‌త్యం బృందం తీవ్రంగా కృషి చేస్తున్నారు. అండ‌ర్ వాట‌ర్ డ్రైవ‌ర్స్ అంద‌రూ కూడా ముందుగా నీటిలోకి దిగి బోటు కింద ఉన్న‌ పంకాకు రోప్ వేవారు. మొత్తం మూడు రోప్‌లు వేసిన‌ప్ప‌టికి కూడా అందులో రెండు రోప్‌లు తెగిపోయాయి. కేవ‌లం ఒక్క రోప్ సాయంతో మాత్ర‌మే బోటును ఒడ్డుకు చేర్చే ప్ర‌య‌త్నాల‌ను స‌త్యం బృందం చేప‌డుతుంది.