విజయ్ దేవరకొండ తండ్రికి దర్శకుడు పూరీ జగన్నాథ్ కు సంబంధం ఏంటో చూడండి

see wha is the relashion between Vijay Devarakondaటాలీవుడ్ లో కష్టపడి పైకొచ్చిన హీరో విజయ్ దేవరకొండ. మొదట్లో చిన్న చిన్న రోల్స్ వేసిన విజయ్ ఆ తర్వాత పెళ్లిచూపులు చిత్రంతో తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్నాడు. అర్జున్ రెడ్డి మూవీతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకున్నాడీ యంగ్ హీరో. ఆ తర్వాత వచ్చిన గీత గోవిందం, ట్యాక్సీవాలా సినిమాలు విజయ్ దేవరకొండ రేంజ్ ను మరింత పెంచేశాయి. అల్లు అరవింద్ వంటి స్టార్ ప్రొడ్యూసర్ సైతం విజయ తో వరుసగా సినిమాలు తీసేందుకు ఉత్సాహం చూపిస్తున్నాడు. ఇక హిట్ డైరక్టర్ కొరటాల శివ సైతం ఈ టాలీవుడ్ అర్జున్ రెడ్డి కోసం ప్రత్యేకంగా కథలు సిద్ధం చేసుకుంటున్నానని చెప్పాడు. ఇప్పుడీ కోవలోకి పూరీ జగన్నాథ్ కూడా వచ్చి చేరాడు. పూరీ ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్రశ్రేణి దర్శకుడు. ఎంత స్టార్ డైరక్టర్ అయినా హిట్లు ఉంటేనే లెక్కలోకి తీసుకుంటారు. పూరీ జగన్నాథ్ టాలెంట్ పై ఎవరికీ సందేహాలు లేవు. కానీ లేనిదల్లా అదృష్టమే. ఇటీవల పూరీ తీసిన చిత్రాలన్నీ బాక్సాఫీసు వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. టెంపర్ తర్వాత పూరీ నుంచి సరైన సినిమా ఒక్కటీ రాలేదు. దాంతో కసి పెరిగిపోయిన పూరీ ఇప్పుడు విజయ్ దేవరకొండతో తీయబోయే సినిమా తన దశదిశ మార్చేస్తుందని బలంగా నమ్ముతున్నాడు. అతడి పనైపోయిందన్న దశలో విజృంభించడం పూరీ స్టయిల్. అప్పట్లో బద్రీకి ముందు పూరీ ఎవరో కూడా తెలియదు… కానీ సెన్సేషనల్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత పోకిరీకి ముందు వరుస ఫ్లాప్ లతో అట్టడుగు స్థానానికి చేరాడు. కానీ పోకిరీతో బ్లాక్ బస్టర్ అంటే ఏంటో టాలీవుడ్ కి చూపించాడు. పూరీలో పసలేదని అందరూ భావిస్తున్న టైమ్ లో టెంపర్ చిత్రంతో తన స్టామినా ఏంటో ఘనంగా చాటుకున్నాడు. ఇప్పుడు కూడా సేమ్ సిచ్యుయేషన్ నడుస్తోంది. అయితే విజయ్ దేవరకొండతో తీసే సినిమా టాలీవుడ్ చరిత్ర తిరగరాసే సినిమా అవుతుందని క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కత్తి లాంటి కథ రాసుకుని స్వయంగా వెళ్లి విజయ్ దేవరకొండకు వినిపించాడట పూరీ జగన్నాథ్. విజయ్ కాకినాడలో ఉన్నాడని తెలుసుకుని తానే వెళ్లి కలుసుకుని కథను ఎక్స్ ప్లెయిన్ చేశాడు పూరీ. సాధారణంగా పవన్ కల్యాణ్ వంటి హీరోలకు కూడా పూరీ ఎప్పుడూ కథను పూర్తిగా వినిపించిందిలేదు. కానీ విజయ్ తో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టి తన రేంజ్ ఏంటో నిరూపించుకోవాలని పట్టుదలతో ఉన్న పూరీ జగన్నాథ్ పాత పద్దతులన్నీ పక్కనబెట్టేసి రంగంలోకి దిగాడు. ఇక పూరీ తన కొత్త సినిమా కోసం విజయ్ దేవరకొండను ఎంచుకోవడం వెనుక ఆసక్తికరమైన అంశం దాగుంది. Image result for vijaydevarakondaవిజయ్ తండ్రి గోవర్ధన్ రావు ఒకప్పుడు దూరదర్శన్ సీరియళ్లలో నటించేవాడు. పూరీ జగన్నాథ్ కూడా మొదట్లో దూరదర్శన్ కోసం అనేక కార్యక్రమాలు రూపొందించాడు. ఆ సమయంలో పూరీ రచయితగా, దర్శకుడిగా పనిచేసిన అనేక సీరియళ్లలో విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధన్ రావు కూడా నటించారు. అప్పటినుంచి పూరీ, గోవర్థన్ రావు మధ్య స్నేహం ఏర్పడింది. ఇప్పటికీ ఇద్దరూ తరచుగా మాట్లాడుకుంటూ ఉంటారు. విజయ్ కెరీర్ కు సంబంధించి కూడా పూరీ ఎన్నో సలహాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయాలని ఉందని పూరీ గోవర్ధన్ రావును అడగ్గా.. ఆయన సంతోషంతో ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ కాకినాడలో డియర్ కామ్రేడ్ షూటింగ్ లో ఉన్నాడు. స్వయంగా తానే పూరీని వెంటబెట్టుకుని వెళ్లాడట గోవర్థన్ రావు. పూరీ చెప్పిన కథతో విజయ్ ఇంప్రెస్ అయినట్టు తెలుస్తోంది. అయితే మొదట రామ్ తో సినిమా తీయాలని పూరీ భావిస్తున్నాడట. అది కంప్లీట్ కాగానే విజయ్ దేవరకొండతో సినిమా ఉంటుందని సమాచారం.