సీఎం బాబు కి షాక్ …..మోడీనా మజాకా …..

ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు ముందస్తు షాక్ తప్పేట్లు లేదా….ఎప్పుడు ఈ అంశంపైనే రాష్ట్రంలో పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి. నవంబర్ లోక్ సభను రద్దు చేయటం ద్వారా చంద్రబాబుకు పెద్ద షాకివ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోడి ప్లాన్ చేస్తున్నట్లు బిజెపి వర్గాలంటూ పెద్ద ప్రచారమే మొదలైంది. జరుగుతున్న ప్రచారం గనుక నిజమై నవంబర్ లోనే లోక్ సభ రద్దైతే జనవరి, ఫిబ్రవరిలోనే పార్లమెంటుకు ముందస్తు ఎన్నికలు తప్పవేమొ అనే అనిపిస్తోంది. అదే జరిగితే ఏపిలో అసెంబ్లీ కూడా రద్దయ్యే అవకాశాలున్నాయి.

chandrababu , trendingandhra

షెడ్యూల్ ప్రకారం ఏపిలో అసెంబ్లీ ఎన్నికలకు మే 15 వరకు గడువుంది. గడువుకు ముందే అంటే ఆరుమాసాల ముందు ఎప్పుడైనా సరే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు జరపటానికి ఎన్నికల కమీషన్ కు పూర్తి అధికారముంది. ఆ లెక్కన డిసెంబర్ 15 తర్వాత అసెంబ్లీ రద్దు చేసే అధికారం ఈసీకి ఉన్నట్లే. ఒకవైపు లోక్ సభ రద్దైతే రెండు మాసాల్లోగా ఎన్నికలు జరపటానికి ఈసీ చర్యలు తీసుకుంటుంది.

జనవరిలో లోక్ సభ ఎన్నికలు జరుగుతాయని అనుకుంటే మే లో జరపాల్సిన అసెంబ్లీ ఎన్నికలను కూడా లోక్ సభ ఎన్నికలతో పాటే కలిపి జరిపేందుకే అవకాశాలున్నాయంటూ బిజెపి వర్గాలు చెబుతున్నాయి. అంటే ఏపిలో షెడ్యూల్ ప్రకారం మే లో జరగాల్సిన ఎన్నికలు ఓ ఐదు మాసాల ముందే జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇప్పటికే ముందస్తు ఎన్నికల కోసమని కెసిఆర్ తెలంగాణాలో అసెంబ్లీని రద్దు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అంటే ఇటు కెసిఆర్ అటు మోడి ముందస్తు ఎన్నికలపై ఒకే విధంగా వ్యూహాలు రచిస్తున్నట్లు అర్ధమవుతోంది.