సీనియర్ కాంగ్రెస్ నేత దారుణ హత్య…

 

విశాఖలో కాంగ్రెస్ నేత దారుణ హత్య కలకలం రేపుతోంది. అక్కయ్యపాలెంలోని ఓ అపార్ట్‌మెంటులో కాంగ్రెస్ మాజీ కార్పొరేటనర్ విజయారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. విజయారెడ్డిని హత్యచేసి బాత్‌రూంలో పడేసి… ఇంటికి తాళాలువేసి దుండగులు పరారయ్యారు. బాత్‌రూంలోని రక్తపు మడుగులో విజయారెడ్డి మృతదేహం కనిపించింది. పక్కా ప్లాన్‌ప్రకారమే విజయారెడ్డి హత్య జరిగినట్టు భావిస్తున్నారు. ఆయన ఇల్లు కొనేందుకు వచ్చినవారే హత్యచేసి ఉంటారని అనుమానం వ్యక్తమవుతోంది.