ఎన్టీఆర్ తో స్టెప్పులు వేయనున్న శ్రేయ

shreya saran in NTR biopic

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు బయోపిక్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో బాలకృష్ణ నటిస్తుండగా , సెన్సిటివ్ డైరెక్టర్ క్రిష్ దీనిని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే రిలీజ్ చేసిన లుక్ తో సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. మిగిలిన స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు కొంత మంది కొన్ని పాత్రల్లో నటిస్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారి పాత్రలో సుమంత్, నందమూరి హరి కృష్ణ గారి పాత్రలో కళ్యాణ్ రామ్ , నారా చంద్రబాబు నాయుడు గారిపాత్రలో రానా చేస్తుండగా , ఇప్పటికే శ్రీదేవి పాత్రలో ఉన్న రకుల్ లుక్, గుండమ్మ కథ సినిమాలోని లేచింది నిద్ర లేచింది పాటలో నటించిన నిత్యమీనన్ లుక్, బసవతారకం గా నటించిన విద్యాబాలన్ లుక్ లు బయటకు వచ్చి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా మరో హీరోయిన్ కు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకొచ్చింది.ఈ బయోపిక్ లో శ్రియ కూడా నటిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. బాలయ్య, శ్రేయ కలిసి చెన్నకేశవ రెడ్డి , పైసా వసూల్ చిత్రాల్లో నటించారు. అయితే ఈ మూవీ లో ఏ పాత్రలో శ్రియ నటిస్తుందా అని అనుకున్నారు. అయితే ఇప్పుడు బయటకు వచ్చిన విషయం ఏంటంటే దాన వీర శూర కర్ణ సినిమాలో చిత్రం భళారే విచిత్రం అనే పాట గుర్తుండే ఉంటుంది కదా ఎన్టీఆర్, నటి ప్రభ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ సాంగ్. ఇప్పుడు అదే పాటను బాలకృష్ణ, శ్రియ మధ్య చిత్రీకరించారట. మరి అప్పట్లో సూపర్ హిట్ సాంగ్ అది. మరి ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలంటే సినిమా వచ్చేంతవరకూ ఆగాల్సిందే. రెండు భాగాలుగా వస్తున్న ఈ మూవీ జనవరి 9 న , 24 న రిలీజ్ కానున్నాయి.