టీ అమ్ముతున్న సోనూసూద్

 

sonu soodప్రతినాయకుడి పాత్రలో తెలుగు ,తమిళ్, బాలీవుడ్, హాలీవుడ్, అని భాషలు లో మంచి నటుడిగా పేరు పొందాడు సోనూసూద్. ఆయన ‘సింబా’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయం అందుకుంది. మూడు రోజుల్లోనే ఈ చిత్రం రూ.100 కోట్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నార. ఇది ఇలా ఉంటే సోనూసూద్ తాను కాలేజ్‌లో చదువుకుంటున్న రోజుల్లో ఎక్కువగా గడిపిన ప్రాంతానికి వెళ్లి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.సోనూ చదువుకునేటప్పుడు నాగ్‌పూర్‌లోని ఓ టీ స్టాల్‌లోనే ఎక్కువగా గడిపేవారట.ఈ నేపథ్యంలో సోనూ నాగ్‌పూర్‌ టీ స్టాల్‌కు వెళ్లి అక్కడ టీ అమ్మారు. సోనూ అమ్మే టీను కొనుక్కోవడానికి అభిమానులు ఎగబడ్డారు. దాంతో వారిని అదుపుచేయడానికి పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ‘సింబా సినిమా సక్సెస్‌ను నాగ్‌పూర్‌ టీ స్టాల్‌ వద్ద సెలబ్రేట్‌ చేసుకుంటున్నాను. నా కాలేజ్‌ రోజుల్లో నేను ఎక్కువగా ఇక్కడే గడిపాను. ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నాను’