ఆపరేషన్ 2019 రివ్యూ ?

 

srikanth,movie reviewనటీనటులు : శ్రీకాంత్ , దీక్షా పంత్ , పోసాని కృష్ణ మురళి

దర్శకత్వం : కరణం బాబ్జీ

నిర్మాత : అలివేలు

సంగీతం : ర్యాప్ రాక్ షకీల్

సినిమాటోగ్రఫర్ : వెంకట్ ప్రభు

ఎడిటర్ : ఉద్దవ్

సీనియర్ హీరో శ్రీకాంత్ నటించిన 125 వచిత్రం ఆపరేషన్ 2019. కరణం బాబ్జీ తెరకెక్కించిన ఈ చిత్రంలో సునీల్ , మంచు మనోజ్ అతిధి పాత్రల్లో నటించారు.

కథ ..ఉమా శంకర్ (శ్రీకాంత్ ) తన గ్రామానికి ఏమైనా చేయాలనే లక్ష్యం తో ఆ ఊరిలో సౌమ్యుడు గా పేరు తెచ్చుకున్న నారాయణమూర్తి ని స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయిస్తాడు.కానీ ఓడిపోయి జైలు వెళ్లి ఆ తరువాత జైలు నుండి బయటికి వచ్చి భారీగా డబ్బు ఇచ్చి ప్రతిపక్ష పార్టీ లో చేరి ఎమ్మెల్యే గా పోటీచేసి గెలుస్తాడు ఇది కథ.

ప్లస్ పాయింట్స్: శ్రీకాంత్ తన నటనతో సినిమానడిపించాడు.ఇక ప్రస్తుతం సమాజంలో వున్నా రాజకీయ పరిస్థితులను చక్కగా వివరించాడు దర్శకుడు కరణం బాబ్జీ ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాలు కూడా బాగున్నాయి.ఇక మిగిలిన పాత్రల్లో నటించిన పోసాని కృష్ణ మురళి , దీక్ష పంత్ వారి పాత్రల మేర చక్కగా నటించారు.

మైనస్ పాయింట్స్ :ఈ కథను రాసుకున్న దర్శకుడు కరణం బాబ్జీ దాన్ని తెర మీద కు తీసుకురావడంలో పూర్తిగా తడబడ్డాడు.శ్రీకాంత్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మరి సాగదీసినట్లుగా అనిపించింది.
ముఖ్యంగా సెకండ్ హాఫ్ చాల చోట్లా నిరాశ పరిచింది.సునీల్ , మంచు మనోజ్ సినిమాకు ఏ మాత్రం ఉపయోగ పడలేదు
ఇక క్లైమాక్స్ లో వచ్చిన మనోజ్ కూడా సినిమాకు ఏం చేయలేకపోయాడు

సాంకేతిక విభాగం :దర్శకుడు కరణం బాబ్జీ తన నుండి సరైన అవుట్ పుట్ ఇవ్వకపోవడంతో సినిమా సాదాసీదాగా సాగింది
ర్యాప్ రాక్ షకీల్ అందించిన సంగీతం గురించి చెప్పడం అనవసరం. వెంకట్ ప్రభు కెమెరా పనితనం బాగుంది.ఉద్దవ్ ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఇక సినిమా నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

తీర్పు :ఆపరేషన్ 2019లో గ్రిప్పింగ్ లేని సన్నివేశాలు, ఆసక్తికరంగా లేని ట్విస్ట్ లు సినిమాకు బలహీనత అయితే శ్రీకాంత్ వన్ మ్యాన్ షో అలాగే ఫస్ట్ హాఫ్ లో వచ్చే సన్నివేషాలు సినిమాకు హైలైట్ గా నిలిచాయి.