ఎస్ ఎస్ రాజమౌళి కొడుకు పెళ్ళికి ఎంత మంది సెలెబ్రిటీ లో…

 

ss rajamouli son weddingఈనెల 30న అంటే ఆదివారం నాడు దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కుమారుడు కార్తికేయ .. నటుడు జగపతిబాబు కజిన్ పూజా ప్రసాద్ ని పెళ్లాడుతున్నాడు. ఇప్పటికే జైపూర్- దిల్లీ నేషనల్ హైవేలో ఉన్న హోటల్ ఫెయిర్ మౌంట్ లో సెలబ్రేషన్స్ జోరుగా సాగుతున్నాయి. నేటి సాయంత్రానికి డార్లింగ్ ప్రభాస్ సహా బాహుబలి బృందం అక్కడ దిగిపోయారు.
నేటి సాయంత్రం మెహందీ కార్యక్రమం జరుగుతోంది. రేపు సంగీత్ కార్యక్రమం జరగనుంది. ఈరోజు ఇప్పటికే సుశ్వితాసేన్ ఆ ఈవెంట్ కి హాజరయ్యారు. రామ్ చరణ్ – రానా – నాగార్జున – నాని – జూ.ఎన్టీఆర్ – అనుష్క – అఖిల్ తదితరులు ఇప్పటికే వెన్యూ దగ్గరకు చేరుకున్నారు.

ప్రస్తుతం ఫెయిర్ మౌంట్ హోటల్ ప్రాంగణం అతిధులతో కళకళలాడిపోతోంది. ఈ పెళ్లి వేడుకకు బాలీవుడ్ కింగ్ సెలబ్రిటీ కరణ్ జోహార్ అటెండ్ కానున్నారని తెలుస్తోంది. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు – ఇటు సౌత్ నుంచి మరింత మంది టాప్ గెస్ట్స్ అటెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఇలా ఉండగా
ఆ వేడుకలో ప్రభాస్ – అనుష్క స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు . ఇక ప్రభాస్ అయితే రెచ్చిపోయి జక్కన్న తో కలిసి డ్యాన్స్ చేసి ఆహుతులను అలరించాడు వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మూడు రోజులు బాహుబలి టీమ్ రచ్చ మామూలుగా ఉండదని అర్థమవుతోంది..ఇంకా అనుష్క ఇంకా లావుగానే కనిపిస్తోంది , ఇంకా తగ్గాలి కానీ తగ్గలేదు . ఇక ప్రభాస్ అనుష్కతో ముచ్చట్లు ఈ వేడుకలో హైలెట్ గా నిలిచాయట . బాహుబలి సమయంలో దాదాపు అయిదేళ్ల పాటు అనుబంధం ఉంది ప్రభాస్, రాజమౌళి లకు , ఇక అనుష్క తో నాలుగు సినిమాలు చేసాడు ప్రభాస్ దాంతో అప్పటి నుండి ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి కానీ ఎప్పటికప్పుడు ఆ వార్తలను ఖండిస్తూనే ఉన్నారు ప్రభాస్ – అనుష్కలు . ఇక ఇప్పుడేమో చిన్నవాడైన కార్తికేయ పెళ్లి కూడా అయిపొయింది మరి ప్రభాస్ పెళ్లి ఎప్పుడో దేవుడికి తెలియాలి