ఆధార్ కార్డు ఆమోదం పై సుప్రీం కోర్ట్ లో రచ్చ

 

aadharcard,supremecourt judgementఆధార్ కార్డు మనషికన్నా ముఖ్యంగా మారిపోయింది. ఆధార్ కార్డు కు ఉన్న విలువ మనిషికి లేకుండా పోయింది అనడంలో అతిశయోక్తి లేదు. ఎక్కడికీ వెళ్ళినా…. ఏమి చెయ్యాలన్నా…. ఆధార్ తప్పనిసరి. అయితే ఇప్పుడు ఈ ఆధార్ పై సుప్రీమ్ కోర్టులో ఆధార్ చట్టం పై మార్పులకు కేంద్ర కేబినెట్ ఆమోదం చెప్పింది. ఆధార్ ని ప్రతి చోట జతపరచడం వలన అనేక ఇబ్బందులను ఎదురుకోవాల్సి ఉంటుంది. ప్రజలు చిక్కుల్లో పడే సమస్య కూడా ఉంది. అందువలన ఆధార్ కార్డు ని బ్యాంకు అకౌంట్లకు , మొబైల్ నంబర్లకు , స్కూల్ అడ్మిషన్లకు ఆధార్ జతపరచడం తప్పనిసరి కాదు అని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కానీ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు , ప్రభుత్వం పధకాలు పొందేందుకు మాత్రం ఆధార్ తప్పనిసరిగా ఇవ్వాల్సిఉంది. ఇక IT రిటుర్న్ దాఖలకు కచ్చితంగా పాన్ కార్డు , ఆధార్ కార్డు పొందిపరచాల్సిన అవసరం ఉంది. కాగా పార్లమెంట్ లో ఈ సమావేశాల్ని ఆమోదం చేసి అవకాశం ఉంది.