తన డ్రైవర్ తో కలిసి కారులో అడ్డంగా దొరికిపోయిన నటి

 

tollywood,updatesసినిమా ఇండస్ట్రీలో డ్రగ్ మాఫియా కలకలం ఇప్పటిది కాదు. గతంలో ఎన్నోసార్లు సినీ నటుల పేర్లు డ్రగ్స్ వ్యవహారంలో వినిపించాయి. కొందరు అరెస్ట్ అయ్యారు కూడా. కొన్నాళ్ల క్రితం టాలీవుడ్ లో డ్రగ్స్ దందా ఎంత కలకలం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పూరీ జగన్నాథ్, చార్మి, సుబ్బరాజు, తనీష్ వంటి ఎంతోమంది ప్రముఖులను సిట్ విచారించింది. తాజాగా మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. కేరళ చిత్ర సీమలో ఈ ఘటన సంచలనం సృష్టించింది. అశ్వథి బాబు అనే మలయాళ నటి డ్రగ్స్ తో దొరికిపోయింది. కొచ్చిలోని తిక్కకార ప్రాంతంలో తన డ్రైవర్ తో కలిసి కారులో డ్రగ్స్ సరఫరా చేసేందుకు వేచి చూస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టమర్ల రాకకోసం అశ్వథి వెయిట్ చేస్తుండగా, అటుగా వచ్చిన పోలీసులకు అనుమానం వచ్చింది. దాంతో పోలీసులు కారులో సోదా చేయగా ఆమె వద్ద ఎండిఎంఏ అనే నిషేధిత డ్రగ్ పెద్దమొత్తంలో లభ్యమైంది. ఇది సింథటిక్ డ్రగ్ అని, లేట్ నైట్ పార్టీల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. అశ్వథి తన డ్రైవర్ బినయ్ అబ్రహాంతో గతకొంతకాలంగా డ్రగ్స్ దందా నడిపిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఆదివారం రాత్రి కూడా తన కస్టమర్లకు స్వయంగా డ్రగ్స్ అందించేందుకు వచ్చిన అశ్విథి అనూహ్యంగా పోలీసులకు పట్టుబడింది. ఈ డ్రగ్ రాకెట్లో చాలామంది ప్రముఖులు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అశ్వథి బాబు మలయాళంలో అనేక సినిమాలతో పాటు టీవీ కార్యక్రమాల్లోనూ నటించింది. ఇంతజేసీ అశ్వథి వయసు 22 ఏళ్లే. కొచ్చిలో ఆమె నివసిస్తున్న ఫ్లాట్ వద్దే పోలీసులకు బుక్కయింది. బెంగళూరు నుంచి తన డ్రైవర్ సాయంతో డ్రగ్స్ తెప్పించి కొచ్చిలో విక్రయిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. అశ్వథి నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ డార్క్ మార్కెట్లో కోట్ల రూపాయలు ఉంటుందని తెలుస్తోంది