తమిళ్ ‘అర్జున్ రెడ్డి’ ట్రైలర్ అదుర్స్

 

arjun reddy,tamil varma‘అర్జున్ రెడ్డి’ ఈ సినిమా పేరు తెలియనివారు ఉండరు. సందీప్ వంగా తెరకెక్కించిన సినిమా అర్జున్ రెడ్డి. ఈ సినిమా ఎలాంటి సంచలనమైన విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిన విషయమే. అలంటి ఈ సినిమాను హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేస్తుండగా, తమిళంలో ‘వర్మ’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం తమిళ్ ‘వర్మ’ ట్రైలర్ సూర్య చేతుల మీదుగా రిలీజ్ అయ్యింది.

అయితే తమిళ్ సినిమా ‘వర్మ’ కు ఓ ప్రత్యేకత వుంది. ఈ సినిమాలో హీరోగా విక్రమ్ తనయుడు ‘ధృవ్’ నటించాడు. ఈ సినిమాకు బాలా దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమా ట్రైలర్ లో హీరో లైఫ్ కి సంబంధిచిన కొన్ని సన్నివేశాలను ఈ ట్రైలర్ లో విడుదల చేశారు. దాదాపు తెలుగులో విజయ్ దేవరకొండ లుక్ లోనే ధృవ్ కూడా కనిపిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తమిళంలోను ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందనీ, ధృవ్ కెరియర్ కి ఈ సినిమా ఓ పునాది అవుతుందని విక్రమ్ భావిస్తున్నాడు. మరి ఈ సినిమా తమిళ ప్రేక్షకులకు ఏ మాత్రం దగ్గర అవుతుందో చూడాలి.