26 నియోజకవర్గాలపై కేసీఆర్ ఆందోళన హరీష్‌ అయినా సరి చేస్తాడా?

 

kcr,harishrao,trending newsతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కి టైం దగ్గర పడింది , ఎవరికి వాళ్ళు ప్రచారాలతో దూసుకుపోతున్నారు , ఇంకా కొన్ని రోజులే టైం ఉండటం తో డబ్బు , మందు తో ప్రజలను ఆకర్షిస్తున్నారు . గెలుపెవరిదో ఎవరూ అంచనా వేయలేని పరిస్థితులు ఉన్నాయి. దీంతో పార్టీలన్నీ మేమె గెలుస్తాము అని భావిస్తున్న నియోజకవర్గాలు పై దృష్టి పెట్టాయి.

ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ 26 నియోజకవర్గాల విషయంలో పరిస్థితులు చేజారుతున్నాయన్న ఆందోళనలో ఉన్నారు. అందుకే ఆ 26 నియోజకవర్గాల బాధ్యతలను అన్నిటిని హరీష్‌రావు కి అప్పగించారు,అక్కడ ప్రచారం చేయడమే కాదు.. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులను సమన్వయం చేసి పార్టీ అభ్యర్థిని గెలిపించేలా వాతావరణాన్ని మార్చాలని దిశానిర్దేశం చేశారు. ఇందు కోసం హరీష్ రావుకు ప్రత్యేకంగా హెలికాఫ్టర్ కూడా కేటాయించారు.

ఒక్క కేసీఆర్ మాత్రమే.. హెలికాఫ్టర్ ఉపయోగించి ప్రచారం చేస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో హరీష్ రావు.. ప్రచారం కూడా ప్రారంభించారు. రోడ్ షోలు సభలతో హరీష్ రావు విస్తృత ప్రచారం చేయనున్నారు. ఈ 26 అసెంబ్లీ సీట్లలో ఎక్కువ TRS సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. నల్లగొండ, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో ఈ స్థానాలు ఉన్నాయి. మెదక్‌లోని పఠాన్ చెరులో కూడా పరిస్థితి చేయిదాటిపోతోందన్న భావన TRS లో ఉంది. ఈ జిల్లాలో హరీష్ రావు అయితే కరెక్ట్ టీఆర్ఎస్ సూచించింది.

ఈ 26 నియోజకవర్గాల్లో హరీష్ రావు తన ఆపరేషన్ ను ప్రారంభించారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితులను చక్క బెట్టేందుకు కొన్ని ఏర్పాట్లు చేశారు. రోడ్ షోలు చేస్తున్నారు . మిగతా పార్టీల నేతల్ని ఆకట్టుకునేందుకు పోలింగ్ సమయంలో వారి వర్గం మొత్తం కారు గుర్తుకు ఓటేసేలా చేసేందుకు తెర వెనుక వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. తనకు బాధ్యతలు అప్పగించిన ప్రతీ సందర్భంలోనూ హరీష్ రావు తన పని తనం చూపించారు. ఇప్పుడు అధికారంలోకి తేవడమో దూరం చేయడమో చేసే 26 నియోజక వర్గాల్లో గెలుపు కోసం హరీష్ రావు పెద్ద భాద్యతలే తీసుకున్నాడు ..
ఈ సారి TRS వస్తుందా , లేకా కాంగ్రెస్ తన వ్యూహాలహతో తిప్పి కొట్టి అధికారం చేజికించుకుంటుందా చూడాలి .. ఎవరి వ్యూహ రచనలు ఎలా ఉన్నాయో , ఈ కాస్తా టైం ని ఎవరు ఎలా వినియోగించు కుంటారో చూడాలి …