కేసీఆర్ ఢిల్లీ టూర్ లో మర్మమేమిటో ?

Kcr delhi Tour,Telugu Vilas
గులాబీ దళపతి,తెలంగాణ అప‌ద్ధ‌ర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మ‌రోమారు అనూహ్య రీతిలో వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఓవైపు ముంద‌స్తు ఎన్నిక‌ల ఎత్తుగ‌డ‌లో బిజీగా ఉన్న గులాబీ ద‌ళ‌ప‌తి తాజాగా ఆకస్మికంగా ఢిల్లీ టూరు పెట్టుకున్నారు. ఎన్నికల సమయం ఎంతో లేని తరుణంలో కళ్ళు, పళ్ళు చెకప్ కోసం ఢిల్లీ వెళ్ళారని చెప్తున్నా వేరే బలమైన కారణం వుంది అన్న భావన రాజీయ వర్గాల్లో వుంది. ఎన్నిక‌ల హీట్ తారాస్థాయికి చేర‌డంతో ఓవైపు మ‌హాకూట‌మి త‌న అస్త్రాల‌కు ప‌దును పెడుతుండ‌టం, మ‌రోవైపు రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి అయిన ఏపీ సీఎం చంద్ర‌బాబు ఢిల్లీలో ఉన్న స‌మ‌యంలో… కేసీఆర్ ఢిల్లీ వెళ్లడం ఆసక్తికరంగా మారింది.

KCR-To-Meet-Narendra-Modi-In-Delhi-Tour,Telugu Vilas
కంటి పరీక్ష కోసమే కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారని టీఆర్ఎస్ పార్టీ అధికారిక ప్రకటన చేసింది. అయితే, ఈ టూరుపై రాజ‌కీయ వ‌ర్గాల్లో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. కేసీఆర్ కూడా 2, 3 రోజులు ఢిల్లీలోనే ఉండేందుకు బయల్దేరారు. తన టూర్ లో పలువురు కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిసే అవకాశం ఉందన్నవార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ కలిసి టీఆర్ఎస్ ను టార్గెట్ చేయడంతో పాటు కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టేందుకు బాబు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ ప్రయాణం అనేక రకాల ఆలోచనలకు దారితీస్తోంది. చంద్రబాబు దాదాపు 3 రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసి పలువురు కాంగ్రెస్‌ నాయకుల్ని కలిశారు. ఈ క్రమంలో బాబు అక్కడ ఉండగానే… కేసీఆర్ అర్జెంటుగా వెళ్లడం పలు ఆలోచనలు రేకెత్తిస్తోంది.
తెలంగాణా ప్రజలకు కంటి పరీక్షలు, చికిత్స తెలంగాణా పల్లెల్లో జరిగితే ముఖ్యమంత్రి కండ్లకు మాత్రము ఢిల్లీ డాక్టర్స్ తో చికిత్స చేయించుకుంటున్నార‌ని కాంగ్రెస్ నేతలు మండి పడుతున్నారు. ఇంతకంటే అవమానం ఏంటని ఆయ‌న వ్యాఖ్యానించారు. కంటి పరీక్షలకు దేశ‌వ్యాప్తంగా ప‌లువురు ప్ర‌ముఖ నేత్ర వైద్యశాల ఎల్వీ ప్రసాద్‌కు వస్తే మన సీఎం ఢిల్లీ కి ఎందుకు పోయాడో జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. నిజంగా సీఎం కంటి సమస్యతో ఢిల్లీ వెళ్తున్నారా లేదా రాజకీయముగా రహస్య పర్యటనా అని ఆయ‌న సందేహం వ్య‌క్తం చేశారు. ఒకపక్క బాబు కలిసొచ్చే ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరుపుతూ థర్డ్ ఫ్రంట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంటే కేసీఆర్ బీజేపీ తో రహస్య మంతనాలు చెయ్యటానికే వెళ్ళిందా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.

Also Read : కేసీఆర్ కు రివర్స్ షాక్ ఇస్తున్న గులాబీ దండు …!

                 టీఆర్ఎస్ కు షాక్ .. ఉత్తర తెలంగాణాలోని ఆ జిల్లాలో గులాబీ గల్లంతేనా …!

                 టీడీపీని టీఆర్ఎస్ టార్గెట్ చెయ్యటానికి కారణం అదే