ప్రముఖ దర్శకుడు కన్నుమూత

 

 The famous director passes away, Telugu vilas

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ బెంగాలీ దర్శకుడు మృణాల్‌ సేన్‌(95) కన్నుమూశారు ఆయన దక్షిణ కోల్‌కతా భవానీపూర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. పద్మభూషణ్‌, దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డులు అందుకున్న మృణాల్‌.. 1955 వచ్చిన ‘రాత్‌భోరే’ అనే చిత్రంతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత ‘నీల్‌ అక్షర్‌ నీచే’, ‘పడాతిక్‌’, ‘భువన్‌ షోమే’, ‘అకాలర్‌ సాంధానే’, ‘ఏక్‌ దిన్‌ ప్రతిదిన్‌’ లాంటి ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను తెరకెక్కించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.
మృణాల్‌ మృతిపట్ల బాలీవుడ్‌ ప్రముఖులు అమితాబ్‌ బచ్చన్‌, నందితా దాస్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. మృణాల్‌ తెరకెక్కించిన ‘భువన్‌ షోమే’ చిత్రం ద్వారా అమితాబ్‌ తన డబ్బింగ్‌ కెరీర్‌ను మొదలుపెట్టారు. సోమవారం కోల్‌కతాలో మృణాల్‌ అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది.