జన్మ రహస్యం..! ఆత్మ ప్ర‌వేశం ఎలా..?

మాన‌వుడి జీవం (ఆత్మ‌) ఎక్క‌డ మొద‌లవుతుంది..? అన్నది ఇప్ప‌టికీ చిక్కుముడి వీడ‌ని ప్ర‌శ్న‌గా మారింది. ఇదే సంద‌ర్భంలో జీవం మొద‌ల‌య్యేది త‌ల్లి గ‌ర్భంలోనా..? లేక కాన్ప‌య్యే స‌మ‌యంలోనా..? అన్న అనుమాన‌మూ రాక‌మాన‌దు. ఇంత‌కీ అస‌లు జీవం అన్న‌ది శ‌రీరంలోకి ఎప్పుడు ప్ర‌వేశిస్తుంది.?

వీట‌న్నిటికి స‌మాధానంగా సద్గురు జగ్గీ వాసుదేవ్ త‌న మాట‌ల్లో ఇలా చెప్పుకొచ్చారు. జీవం శ‌రీరంతో ఊరికే జ‌త‌ప‌డ‌దు. అది ఒక ప్ర‌క్రియ‌గా జ‌రుగుతుంది. ఒక స్త్రీ లేదా త‌ల్లి గ‌ర్భం దాల్చిన‌ప్పుడు, రెండు క‌ణాలు ఒక్క‌టైన త‌రువాత‌నే మాంస‌పు ముద్ద అవుతుంది. ఈ మాంస‌పు ముద్ద జీవంగా మారాలంటే గ‌ర్భం దాల్చిన 40 నుంచి 48 రోజుల స‌మ‌యం ప‌డుతుంది. ఆ త‌రువాతనే జీవ ప్ర‌క్రియ ప్ర‌వేశిస్తుంది.

మ‌రికొన్ని కొన్ని జీవాలు కొంత ఆల‌స్యంగా ప్ర‌వేశిస్తాయి. ఆ విష‌యాన్ని స్త్రీ మాత్ర‌మే అనుభూతి చెంద‌గ‌ల‌దు. ఒక‌వేళ ఆమె 48 రోజుల త‌రువాత జీవం ప్ర‌వేశించిన‌ట్టుగా అనుభూతి చెందిన‌ట్ల‌యితే ఒక అస‌మాన‌మైన వ్య‌క్తికి జ‌న్మ‌నివ్వ‌బోతుంద‌ని అర్ధం.

ఎందుకంటే అలాంటి జీవం స్థిర‌ప‌డ‌టానికి కొంత స‌మ‌యం తీసుకుంటుంది. దాని అర్ధం ఒక అస‌మాన‌మైన జీవం పురుడుపోసుకోబోతుంద‌ని. ఒకానొక స‌మ‌యంలో ఓ వ్య‌క్తి గౌత‌మ‌బుద్ధుని త‌ల్లిని చూసి నువ్వు ఒక అస‌మాన‌మైన వ్య‌క్తికి జ‌న్మ‌నివ్వ‌బోతున్నావ‌ని చెప్ప‌డం. అలాగే ఎవ‌రో య‌శోద‌ను చూసి నువ్వు ఒక అసాధార‌ణ‌మైన బిడ్డ‌కు జ‌న్మ‌నిస్తావ‌ని చెప్ప‌డాన్ని స‌ద్గురు ఉదాహ‌ర‌ణ‌లుగా చెప్పారు.

కానీ, సాధార‌ణంగా జీవం 40 నుంచి 48 రోజుల్లోపు గ‌ర్భంలోకి ప్ర‌వేశిస్తుంది. ఏదైని కార‌ణం చేత‌వ‌ల్ల శ‌రీరం జీవానికి త‌గిన‌ట్టుగా లేక‌పోతే, పుట్ట‌క‌ముందే ఆ జీవం నిష్క్ర‌మిస్తుంది.అలాంట‌ప్పుడు ప్రాణం లేని బిడ్డ బ‌య‌ట‌కొస్తాడ‌న్న‌ది స‌ద్గురు మాట‌. లేదా ఏమైనా నిర్బంధ పరిస్థితుల వ‌ల్ల ఒక త‌ల్లి బిడ్డను గ‌ర్భ‌స్రావం చేసుకోద‌ల్చ‌వ్చు. అది మ‌రొక విష‌యం.

కానీ, ఎటువంటి ప‌రిస్థితుల్లోను శ‌రీరంతో జీవానికి ఉన్న సంబంధం దాదాపుగా 84 నుంచి 90 రోజుల్లోపు జ‌రుగుతుంది. ఈ స‌మ‌యంలోనే జీవం దేహంతో జ‌త‌క‌డుతుంది. అప్ప‌టి వ‌ర‌కు అది గ‌ర్భం స‌రైన‌దేనా..? అని శంస‌యిస్తూనే ఉంటుంది. ఈ ప్ర‌క్రియ అంతా స్పృహ‌తో జ‌రిగేది కాదు. ఇది అచేత‌నంగా, ధోర‌ణుల ప‌రంగా జ‌రిగేది. సాంప్ర‌దాయ‌ప‌రంగా దీన్ని వాస‌న‌లు అంటారు.

అలా జీవం త‌న‌కు అనువైన దేహం కోసం వెతుకుతూ ఉంటుంది. అది ఈ శ‌రీరంతో పాక్షికంగా కూడుకున్న‌ప్ప‌టికీ 90 రోజుల్లోపు నిష్క్ర‌మించ‌వచ్చు. లేదా 84 నుంచి 90 రోజుల్లోపు శ‌రీరంతో స‌రిగ్గా జ‌త‌క‌డుతుంది. అప్ప‌టి నుంచి ఇది పూర్తిస్థాయి బిడ్డ‌. ఆ త‌రువాత‌నే అది స‌రైన జీవం అవుతుంది.