తిరుమలలో నిత్యాన్నధానం ఎందుకో తెలుసా…

Tirumala

అన్నదానం అన్ని దానాలలోకి మిన్న అంటారు మన పెద్దలు. అనడమే కాదు ఇది నిజం కూడా. ఏది లేకపోయినా బ్రతకగలం కానీ సరైన సమయానికి ఆహారం లేకుంటే మాత్రం మనం ఉండలేం. అందుకే అన్నదానం మిన్న అని అంటుంటారు పెద్దలు. అయితే ఒకప్పుడు రాజుల కాలంలో అన్నదానాన్ని రాజులు వారి భవనాల్లో చేసేవారు. ఇప్పుడు తరాలు మారి దేవాలయాల్లో నిత్యాన్నదానం చేస్తున్నారు.

ఇదే నేపథ్యంలో మన ఆంధ్రాలో తిరుమల దేవస్థానం భోజనశాల గురించి తెలుసుకోండి. తిరుమల దేవస్థానంలో రోజు అన్నదానం జరుగుతుంటుంది. ఆలయానికి వచ్చి దేవుడి దర్శనం చేసుకున్న ప్రతి ఒకరు ఈ భోజనాన్ని కడుపునిండా తినే వెళ్తారు. ఎందుకంటే ఆ భోజనం అంత రుచిగా చేస్తారు. మొదట తినే పులిహోర నుంచి చివరి పెరుగన్నం వరుకు భోజనం అంత కమ్మగా ఉంటుంది. అయితే వంట చెయ్యడానికి, వడ్డించడానికి వేలమంది వర్కర్లు ఉంటారు అక్కడ.

తిరుమలలో నిత్యాన్నదానం అంత బాగా జరగటానికి కారణం ఎన్టీఆర్. 1983లో దివంగతనేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తిరుమలలో రోజు అన్నదానాలు జరగాలి అని ఆదేశించారు. అప్పటి నుండి ఇప్పటివరకు రోజు అన్నదానం జరుగుతుంది. అన్నదానం చెయ్యడానికి వేలమంది వర్కర్లు ఉంటారు. అలాగే వడ్డించడానికి శుభ్రపరచడానికి షిఫ్ట్ కు 1000మందికి పైగా వర్కర్లు ఉంటారు. తిరుమలలో రోజుకు కొన్ని వేల మంది ఉదయం దద్ధోజనం నుంచి రాత్రి ఆహారం వరుకు ప్రతి ఒక్కటి ఉంటాయి.

గత ముప్పైమూడు సంవత్సరాలుగా ఇక్కడ భోజనం ఆగకుండా జరగటానికి కారణం దేశ విదేశాల నుంచి తిరుమల భక్తులు టీటీడీ ట్రస్ట్ విరాళాలు పంపుతుంటారు. ముప్పైమూడు సంవత్సరాలుగా టీటీడీ ట్రస్ట్ ఇలానే నడిచింది. ఇప్పటికి ఈ దానాలు అన్ని కలపి ఈ మర్చి చివరికి 98 వేళా కోట్లు ఉంటాయట.. 33 సంవత్సరాలుగా తిరుమలలో ఈ ట్రస్ట్ ఇలానే నడుస్తుంది అంటే ప్రపంచవ్యాప్తంగా తిరుమల వెంకటేశ్వర స్వామిపై ఎంత ప్రేమ ఉందొ కనిపిస్తూనే ఉంది.