గిన్నిస్ బుక్ లో పేరు సంపాదించిన తెలుగు సినిమా మహానుభావులు

 

telugu vilas

1) దగ్గుపాటి రామానాయుడు గారు తెలుగు సినిమా గర్వించదగ్గ ప్రొడ్యూసర్. సురేష్ ప్రొడక్షన్స్ స్థాపించి ఎన్నో అద్భుత చిత్రాలను నిర్మించారు రామానాయుడు గారు. రామానాయుడు స్టూడియోస్ ను నిర్మించి ఎంతో మందిని ప్రజలకు ఉపాధి కల్పించారు రామానాయుడు గారు. ఏ ప్రొడ్యూసర్ నిర్మించని అత్యధిక 130 చిత్రాలని నిర్మించి గిన్నిస్ రికార్డ్ సాధించారు రమనీడు గారు. ఈయన తెలుగు , తమిళ్, హిందీ, కన్నడ, బెంగాలీ , పంజాబీ ఎలా దాదాపు అన్ని భాషల్లో చిత్రాల్ని నిర్మించారు.

2) దర్శకరత్న దాసరి నారాయణరావు గారు తెలుగు సినిమా దశ దిశను మార్చేసిన డైరెక్టర్. తెలుగు సినిమా కి కమర్షియల్ హంగులు అద్దిన డైరెక్ట్ దాసరి నారాయణరావు గారు. ఆయన సినిమా ల తోనే దర్శకుడి కి గుర్తిపు దక్కింది. డైరెక్ట్ ఐస్ థ కెప్టెన్ అఫ్ షిప్ అనే నినాదం ఆయన లో నుంచే పుట్టినదే. అందుకే ఆయన జన్మదినాన డైరెక్ట్స్ డే గా జరుపుకుంటారు. 151 చిత్రాలకు దర్శకత్వం వహించిన అలుపెరగని బాటసారి దాసరి నారాయణరావు గారు. అత్యధిక చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడిగా ఆయనకు గిన్నిస్ రికార్డ్ లో ఆయన పేరు నిలిచిపోయింది.

3) బ్రహ్మానందం… ఆ పేరు వింటేనే మనకి తెలియకుండా నవ్వు వచ్చేస్తుంది. ఆయన ఒక శివానందలహరి. ఎన్నో గొప్ప పాత్రలు. ఆయన ఒక కమెడియన్ మాత్రమే కాదు గొప్ప విలక్షణ నటుడు కూడా. ఆయన నటించిన అత్యధిక చిత్రం మారె నటుడు నటించలేదు. ఈయన 1000 కి పైగా చిత్రాల్లో నటించి గిన్నిస్ రికార్డ్ ఎక్కారు.

4) పి. సుశీల గారు ఆమె పాట పడితే కోయిల పడినట్టు ఉంటుంది. అత్యధిక పాటలు పడినా లేడీ సింగర్ గా గిన్నిస్ రికార్డికి ఎక్కారు సుశీల గారు.

telugu vilas
telugu vilas

5) ఒక లేడీ డైరెక్షన్ చేస్తుందంటేనే ఆశ్చర్యం. అలాంటింది అప్పట్లోనే ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వచించారు విజయ నిర్మల.47 చిత్రాలకు దర్శకత్వం వహించిన లేడీ డైరెక్టర్ ఆమె గిన్నిస్ రికార్డ్ సొంతం చేసుకుంది. అంతే కాదు ఈమె 200 సినిమాలలో నటించగా , 15 సినిమాలను ప్రొడ్యూస్ చేసారు.

6) s.p బాలసుబ్రమణ్యం గారు ఎటువంటి పాటనైనా అవలీలగా పడేస్తారు బాలు. ఆయన లేక పోతే తెలుగు సినిమా పాటే లేదు. ఎన్నో వందల సినిమా పాటలు పాడారు ఆయన. ఆయన గొంతు తెలియని తెలుగు సంగీత ప్రేమికుడు ఉండదు. ఆయన పాడిన పాటలను టక్కున కనిపెటేయవచ్చు. అంతలా ఆయన గొంతుతో మనకు మధుర ధ్వనులను వినిపించారు బాలు గారు.మారె గాయకుడు పాడలేని ఎన్నో అత్యధిక పాటలు పాడిన గొప్ప గాయకుడిగా గిన్నిస్ రికార్డ్ తో తన గొంతును ప్రపంచానికి వినిపించారు.