‘డెప్ప్రెషన్’లో కైరా అధ్వాని ….

 

Kiara advani

‘భరత్ అనే నేను’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన కథానాయిక కైరా అద్వాని. మొదటి సినిమాతోనే మహేశ్ జోడీగా ఛాన్స్ దొరకడం ఒక అదృష్టం అవుతే. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో అతి త్వరగా తెలుగు ప్రజల్లో భారీ అభిమానులను పెంచుకుంది ఈ అందాల భామ. ఈ సినిమా తరువాత ఆమెకి రామ్ చరణ్ సరసన నటించే గోల్డెన్ అవకాశాన్ని అందుకుంది. దీంతో టాలీవుడ్లో ఆమె జోరు కొనసాగడం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ పాపకు ఇక్కడే పెద్ద నష్టం ఎదురయ్యింది.

‘వినయ విధేయ రామ’ సినిమా కూడా హిట్ అయ్యింటే తెలుగులో వరుస అవకాశాలు వచ్చేవి .. దీంతో  అగ్ర కథానాయికల జాబితాలో చేరిపోయేది అని కైరా అద్వాని ఆశించింది. నిజంగానే సినిమా హిట్ కొట్టేసి వుంటే డిమాండ్ అమాంతంగా పెరిగిపోయేది. కానీ అలా జరగలేదు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా సంక్రాంతి డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాపై తాను పెట్టుకున్న అంచనాలన్నీనేలమట్టం  అవ్వడంతో పాపా బాగా అప్సెట్ అయిందట, దింతో డిప్రెషన్ కి కూడా వెళ్లిపోయిందట. ఇకనుంచి తెలుగులో చేసే సినిమాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చిందట.