2018 లో అత్యధిక వసూలు సినిమాలు ఇవే

 

movies,collection2018 మన తెలుగు స్థాయి ని పెంచింది చాల సినిమాలు హిట్ అయ్యాయి అత్యధిక కలెక్షన్స్ తో దూసుకుపోయాయి . ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

భాగమతి : అనుష్క నటించిన ‘భాగమతి’ సినిమా 30 కోట్ల బడ్జెట్‌లో తెరకెక్కించారు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 66.8 కోట్ల గ్రాస్ వసూలు చేయగా 35.3 కోట్ల షేర్ వసూలు చేసింది.

చినబాబు:కార్తి హీరోగా రూపొందిన తమిళ చిత్రం ‘చినబాబు’. 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు . ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 70 కోట్ల గ్రాస్ వసూలు చేసింది రూ. 37 కోట్ల మేర షేర్ వసూలు కావడం విశేషం.

మహానటి : నటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘మహానటి’. ఈ సినిమాను 20 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు
ఈ చిత్రం వరల్డ్ వైడ్ 85.1 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇందుల 46.4 కోట్ల షేర్ వసూలయ్యాయి , ఈ సినిమా 2018 లోనే కీర్తి సురేష్ సినిమాల్లో బెస్ట్ సినిమా గా నిలిచింది .

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా : అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’. 65 కోట్ల బడ్జెట్‌తో తీశారు . ఈ సినిమా కి 92 కోట్లు గ్రాస్ వరల్డ్ వైడ్ గా వచ్చింది
ఇందులో రూ. 53.8 కోట్ల షేర్ మాత్రమే వసూలైంది. ఈ ఇయర్ ఈ సినిమా యావరేజ్ గా ఆడింది .

అజ్ఞాతవాసి: పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అజ్ఞాతవాసి’. 90 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 93 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. 57.5 కోట్లకు మించి షేర్ వసూలు కాక పోవడంతో భారీ నస్టాలు తప్పలేదు. 2018 లోనే భారీ సినిమాల్లో ఇది ఒకటి ఫాన్స్ చాల అసలు పెట్టుకున్నారు , పెద్ద ప్లాఫ్ తప్పలేదు

గ్యాంగ్: సూర్య హీరోగా నటించిన చిత్రం ‘గ్యాంగ్’. 50 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ప్రపంచ వ్యాప్తంగా 95 కోట్ల గ్రాస్ రాబట్టింది. 48.4 కోట్ల షేర్ వసూలైంది. ఈ సినిమా పర్వాలేదు అనిపించింది .

గీత గోవిందం: విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గీత గోవిందం’. కేవలం 12 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు , ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 126 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇందులో 70.1 కోట్ల షేర్ రావడం విశేషం ,2018 లో అత్యధిక కలెక్షన్ సినిమాల్లో ఇది ఒకటి , విజయ్ కెరీర్ లోనే పెద్ద హిట్ ఇచ్చింది ఈ సినిమా .

అరవింద్ సమేత వీర రాఘవ : NTR హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. 65 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ 155 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 90.7 కోట్ల షేర్ వసూలు చేసింది.
భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఎన్టీఆర్ కి మరో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది .

కాలా: రజనీకాంత్ హీరోగా రంజిత్ పా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కాలా’. 135 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం 168 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. రూ. 85 కోట్లకు మించి షేర్ వసూలు కాలేదని ట్రేడ్ వర్గాల సమాచారం. అయితే సినిమా బాగున్నా కలెక్షన్స్ అంతగా రాలేదు అట

భరత్ అనే నేను: మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘భరత్ అనే నేను’ చిత్రాన్ని దాదాపు 70 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 210 కోట్ల గ్రాస్ వసూలు చేయగా అందులో 105 కోట్ల షేర్ వసూలైంది. మహేష్ బాబు ఖాతాలో లో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఇది

రంగస్థలం: రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రంగస్థలం’. 50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 215.7 కోట్ల గ్రాస్ రాబట్టింది. 125.2 కోట్ల షేర్ వసూలు చేసింది. రామ్ చరణ్ కి మంచి ప్రశంసలు వచ్చాయి ఈ సినిమా తో యాక్టింగ్ లో మరో మెట్టు ఎక్కాడు , మరో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకునాయుడు .

సర్కార్: విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సర్కార్’. 115 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 257 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 139 కోట్ల షేర్ వసూలు చేసింది. ఓటు కాన్సెప్ట్ తో వచ్చిన తెలుగు లో బాగా ఆడింది

2.౦: రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘2.0′. 540 కోట్ల బడ్జెట్‌తో రుపొంచించగా . ఈ చిత్రం ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 710 కోట్ల గ్రాస్ వసూలు చేసింది , ఇంకా కొనసాగుతున్నాయి , బాహుబలి ,తర్వాత మల్లి అంత పెద్ద సినిమా ఇదే