ఫాన్స్ ను సైతం భయపెట్టిన టాప్ 5 డిజాస్టర్స్ …!

top 5 disasters in tollywood, Telugu Vilas

ఫాన్స్ ను సైతం భయపెట్టిన టాప్ 5 డిజాస్టర్స్

స్టార్ హీరో సినిమా అంటే అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీ లో కూడా ఎన్నో అంచనాలు ఉంటాయి. సటిల్లైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ అంటూ బిసినెస్ దండుగా ఉంటుంది. డిస్టిబ్యూటర్లు , బయ్యర్లు అత్యంత ధరలకు సినిమా హక్కులను దక్కించుకుంటారు. మరి ఆలాంటి భారీ అంచనాల నడుమ విడుదలై దారుణమైన నష్టాలను మూటగట్టుకుని డిసాస్టర్ గా మిగిలిన చిత్రాలు చూద్దాం.

ఆజ్ఞతవాసి
సంక్రాంతి కనుకుగా ఎన్నో అంచనాలు , ఎన్నో ఊహాగానాలు పవన్ కళ్యాణ్ 25 వ సినిమా కావటం , సూపర్ హిట్ కాంబినేషన్ త్రివిక్రమ్ దర్శకత్వం వహించడం ఈ సినిమా పై అంతులేని అంచనాలను ఏర్పరిచాయి. త్రివిక్రమ్ కి ఖలేజా మినహా మరో ప్లాప్ లేదు. ఈ మూవీ తెలుగునాట అన్ని రికార్డులు బ్రేక్ చేసి దాదాపు బాహుబలి ని అందుకుంటుంది అని అందరూ ఊహించారు. కానీ అంచనాలను తారుమారు చేస్తూ మిడ్ నైట్ షోల నుంచే సినిమాకి డిసాస్టర్ టాక్ వచ్చింది. 130 కోట్ల బిసినెస్ సాధించిన ఈ చిత్రం 65 కోట్ల నష్టాలు మిగిల్చి మొదటి స్థానం లో ఉంది.

Image result for agnyathavasi

స్పైడర్
సూపర్ స్టార్ మహేష్ , మురగదాస్ కాంబినేషన్ కోసం ఎదురు చుడనివారు లేరు. అలాంటిది ఈ క్రేజీ కంబినేషన్ అనౌన్స్ చేసాక అంచనాలు ఆకాశాన్ని తాకాయి. మామూలుగానే మురగదాస్ సినిమా అంటే సోషల్ ఎలిమెంట్ తో పాటు , మాస్ ఎలిమెంట్స్ కూడా పుష్కలం గా ఉంటాయి. సో ,అందరూ కన్ఫర్మ్ హిట్ అనుకున్నారు , ఈ మూవీ కూడా 120-130 కోట్ల బిసినెస్ చేసి 60 కోట్ల నష్టాల్ల్నే చవి చూసింది.

బ్రహ్మోత్సవం
శ్రీమంతుడు వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తరువాత శ్రీకాంత్ అడ్డాల , మహేష్ బాబు ల కాంబినేషన్ కావడంతో మహేష్ అభిమానులతో పాటు ఫామిలీ ఆడియన్సు కూడా సినిమా పై అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా అనుభవం గురుంచి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు డై హార్డ్ ఫాన్స్ కూడా భయపడేలా ఉంటుంది ఈ సినిమా. ఈ మూవీ 50 కోట్ల నష్టాన్నే మిగిల్చింది.

Image result for brahmotsavam mahesh babu

సర్ధార్ గబ్బర్ సింగ్
పవన్ కళ్యాణ్ కి వరస ప్లాపుల్లో నుంచి బైట పడేసిన చిత్రం గబ్బర్ సింగ్. ఈ సినిమా తో పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. అలాంటి గబ్బర్ సింగ్ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ కూడా మంచి హైప్ తో రిలీజ్ అయ్యి 40 కోట్ల నష్టపోయింది.

ఆగడు
దూకుడు బ్లాక్ బస్టర్ కాంబో మహేష్ , శ్రీనువైట్ల కలిసి చేసిన చిత్రం ఆగడు. మహేష్ మాస్ పోలీస్ గా కనిపించిన ట్రైలర్ తో ఈ సినిమా అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. అప్పట్లో ఈ సినిమా కి వున్న పబ్లిసిటీ , మరే సినిమాకి లేదు. ఇది కూడా 40 కోట్ల నష్టాలతో టాప్ 5 డిసాస్టర్ లో 3 డిసాస్టర్ లు మహేష్ బాబుయే ఉన్నాయ్.

Related image

 

Related Posts: — 

యంగ్ హీరోల‌కు క‌లిసి రాని 2018

నెట్టింట్లో ఇలియానాపై సెటైర్లు..!

హాల్ చల్ చేస్తున్న ఇలియానా ..!

తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ఊచకోత…!

గూగుల్ ట్రెండ్ లో సెక్షన్ 49 p