ప్రధాని సమక్షంలో మహిళా మంత్రికి లేని భద్రత…?

pm,narendra modi

రోజు రోజుకి మహిళలపైనా పెరిగి పోతున్న అఘాయిత్యాలు,అమానుష్యాలు ఇలా చెప్పుకుంటూ పోతే రోజులు సరిపోవు….పురాణాల నుంచి, ఇప్పుడు పుట్టిన పసి పాప వరకు ఎక్కడ ఉంది రక్షణ. ఏమై పోతుంది సమాజం. బయట సమాజమే ఇలా ఉందా, అని అనుకుంటే అంతటా ఇదే తంతు. మహిళల పట్ల లైంగిక వేధింపుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వాటికి అంతమంటూ ఉండదు. పసికందులు నుంచి ముసలి వాళ్ల వరకూ ఊర కుక్కల్లా తెగపడుతున్న వైనం. ఎన్ని నిర్భయ చట్టాలు వస్తే మాత్రం ఏం లాభం. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి త్రిపురలో చోటు చేసుకుంది. మదమెక్కి కొట్టుకుంటున్న ఓ మంత్రివర్యుడు.. తోటి మహిళా మంత్రిని అసభ్యకర రీతిలో తాకాడు. అది కూడా స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో. గత శనివారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళితే …… అగర్తాలలో నిర్వహించిన ఓ ర్యాలీకి ప్రధాని నరేం‍ద్ర మోదీతో పాటు.. త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌ దేవ్‌ కూడా హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి ఆహార మంత్రిత్వ శాఖ మినిస్టర్‌ మనోజ్‌ కంతి దేబ్‌తో పాటు.. త్రిపుర ఏకైకా మహిళా మంత్రి కూడా వెళ్లారు. వేదిక మీద కార్యక్రమం జరుగుతుండగా మనోజ్‌ కంతి దేబ్‌ .. సదరు మహిళా మంత్రిని వెనక నుంచి అసభ్యకర రీతిలో తాకాడు.ఇలా తాకిన దృశ్యం కాస్త సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది.ఇలాంటి నీతి మాలిన పని చేసిన మంత్రి మనోజ్‌తీరు ను ఎండగడుతున్నాయి ప్రతిపక్షాలు.

‘ప్రధాని, ముఖ్యమంత్రి సమక్షంలో మనోజ్‌ ఓ మహిళా మంత్రి పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఆమె గౌరవానికి భంగం కలిగించాడు. తక్షణమే అతన్ని పదవి నుంచి తొలగించి.. అరెస్ట్‌ చేయాల్సింది’గా డిమాండ్‌ చేస్తున్నాయి విపక్షాలు. ఈ విషయం గురించి మనోజ్‌ను వివరణ కోరగా అతడు స్పందించడానికి నిరాకరించడం జరిగింది.