అన్ని నియోజక వర్గాల్లో తెరాస ఆధిక్యం – కాంగ్రెస్ ఇంటికేనా….

 

TRS's lead in all constituencies - Congress homeఎవరి అభిప్రయాలు ఎలా ఉన్న సరే చివరకు ప్రజలే గెలుస్తారు , అయితే ఇప్పుడు
ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ప్రధాన పోటీ టీఆర్ఎస్, మహాకూటమి మధ్య నెలకొని ఉంది. బీజేపీ, మజ్లిస్ పార్టీలు ఈసారి తమ బలం పెరుగుతుందనే ధీమాతో ఉన్నాయి. తెరాస చాలా క్లిష్టంగా గట్టెక్కే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్ ఫలితాల సరళి ద్వారా వెల్లడవుతోంది. మరోవైపు మహాకూటమి గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వేలో వెల్లడైంది.

టీఆర్ఎస్ 65 స్థానాల్లో ముందంజలో ఉంది మహాకూటమి 21 స్థానాల్లో ముందంజలో ఉంది.బీజేపీ 3 స్థానాల్లో ముందంజలో ఉంది మజ్లిస్ 3 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు 1 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

గజ్వెల్ – కేసీఆర్, వంటేరు ప్రతాప్ రెడ్డి కూకట్‌పల్లి- నందమూరి సుహాసిని, మాధవరం కృష్ణారావు కొడంగల్ – రేవంత్ రెడ్డి పైన 200 ఓట్ల ఆధిక్యంలో తెరాస అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారు. సిరిసిల్ల – కేటీఆర్ ముందంజలో ఉన్నారు.

కూకట్‌పల్లిలో టీడీపీ అభ్యర్థి సుహాసిని వెనుకంజలో ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి వెనుకంజలో ఉన్నారు. కరీంనగర్‌లో గంగుల కమలాకర్ ముందంజలో ఉన్నారు. షబ్బీర్ అలీ వెనుకంజలో ఉన్నారు.

చివరి వరకు ఎలా ఉన్న సరే ఇప్పుడు అయితే తెరాస దే విజయం అని అందరు అనుకుంటున్నారు ,చూడాలి వోటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుందో ..