ఐక్యరాజ్యసమితి లో ఇండియా పై ట్రంప్ పొగడ్తల వర్షం…!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. భారత ప్రభుత్వం లక్షలాది మంది ప్రజలను పేదరికం నుంచి వెలుగులోకి తీసుకొస్తున్నట్టు ప్రశంసించారు. ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా ఇప్పటికే చాలా మంది పేద ప్రజలు మధ్య తరగతి శ్రేణిలోకి ప్రవేశించారని తెలిపారు. మంగళవారం ఐరాస జనరల్ అసెంబ్లీ 73వ సమావేశం సందర్భంగా దేశాధినేతలను ఉద్దేశించి కీలక ఉపన్యాసం చేస్తూ.. ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
trump , donald trump , trendingandhra
కోట్లాది మంది ప్రజల మధ్య భారతదేశంలో స్వేచ్ఛా సమాజం పరిఢవిల్లుతున్న తీరు అద్భుతమని ట్రంప్ కొనియాడారు. పేదరికాన్ని పారదోలే విషయంలో భారత ప్రభుత్వం అనేక విజయాలు సాధిస్తున్నట్లు తెలిపారు. అమెరికా అధ్యక్షుడి హోదాలో యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్న డొనాల్డ్ ట్రంప్ సుమారు 35 నిమిషాల పాటు ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు దేశాల సమస్యలు, సమకాలీన అంశాల గురించి ప్రస్తావించారు.

పేదరికాన్ని తగ్గించడంలో భారత్ అనితర సాధ్యమైన విజయాలు సాధిస్తున్నట్లు ఐరాస నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో భారత్‌లో పేదరిక రేటు సగానికి పైగా తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి