ఇక ఉబెర్ కార్లు డ్రైవర్ లేకుండా వెళ్తాయట…

Uber Self Driving Cars

అవును ఇది నిజమే

Uber Self Driving Carsఇక భవిష్యత్తులో కార్లకి డ్రైవర్లు అవసరం ఉండదు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు వచ్చేస్తున్నాయి ఈ తరహాలోనే ప్రముఖ కార్ టాక్సీ సర్వీస్ అయిన “ఉబెర్” సరికొత్త సెల్ఫ్ డ్రైవింగ్ కారును లాంచ్ చేసింది దీని కోసం ప్రముఖ లగ్జరీ కార్ల సంస్థ “వోల్వో మోటార్స్” తో భాగస్వామ్యం కుదుర్చుకుంది ఇప్పటికే ఉబెర్ ఈ విభాగంలో దూసుకెళ్తుంది తాజాగా వోల్వో ఎక్స్‌సీ90 పేరుతో ఒక నెక్స్ట్ జనరేషన్ సెల్ఫ్ డ్రైవింగ్ కారును కూడా లాంచ్ చేసింది

సెల్ఫ్ డ్రైవింగ్ కారు ఎక్స్‌సీ90 కారు త్వరలోనే ఉబెర్ వాహన జాబితాలోకి చేరబోతోంది ఉబెర్ ఈ కారు పై భాగంలో ఒక సెన్సారు వ్యవస్థను ఏర్పాటు చేసింది అంతేకాకుండా ఈ కారులో ఆటోమేటెడ్ బ్రేకింగ్ అండ్ స్టీరింగ్ సిస్టం కూడా ఉన్నాయి ఒకవేళ ఈ సెన్సారు వ్యవస్థ ఫెయిల్ అయినా కూడా ఇవి పనిచేస్తాయి

ఈ కారు “వోల్వో” కంపెనీది అయినా కూడా ఇందులో ఉబెర్ సాఫ్ట్వేర్ ఫంక్షన్ అయి ఉంటుంది ఈ యొక్క సాఫ్ట్వేర్ వల్లనే ఈ కారు డ్రైవర్ అవసరం ఏ మాత్రం లేకుండానే గమ్యస్థానానికి చేరుకుంటుంది ఉబెర్ ఇప్పటికే అమెరికా మార్కెట్లో వోల్వో ఎక్స్‌సీ90 మోడల్ ను ఉపయోగిస్తోంది స్వీడన్ లో కూడా ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కారును నడిపేందుకు అనుమతులు ఉన్నాయి

Uber Self Driving Cars