‘వైసీపీ’ నుంచి బయటకు వచ్చినందుకు బాధపడుతున్న : వంగవీటి

 

vangaveeti radha krishna,jagan

గత వారం వైసీపీలో రాజీనామా చేసి అతి త్వరగా టీడీపీలో చేరాడు వంగవీటి. అయితే ఈరోజు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వంగవీటి రాధాకృష్ణ నిప్పులు చెరిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తాను చేరినప్పుడు నాకు తమ్ముడు కంటే ఎక్కువ అని వైఎస్ జగన్ చెప్పారని రాధా చెప్పుకొచ్చారు. అయితే చివరకు తనకు అన్యాయం జరిగిందని అన్నారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ జగన్ పై విమర్శలు చేశారు.

వంగవీటి మాట్లాడుతూ ‘రూ.100కోట్లు ఇవ్వడం వల్లే తాను వైసీపీ వీడానని వస్తున్న వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు ఏ నాకొడుకు చేసినా తాను పట్టించుకోనన్నారు’. చంద్రబాబు పిలిస్తే తన అనుచరులు చిల్లర రాజకీయాలు చేసారు అని అన్నారు . ఇంక వంగవీటి జగన్ తో తాను ఉండకుండా చంపేస్తా అని బెదిరించారు అని అన్నారు, చాలా కాలం నుంచి తనని అవమానించారు అని అక్కడ ఉన్నంతసేపు తన క్యారెక్టర్ ని పక్కన పెట్టారు అని చెప్పారు. ఏదేమైనా అప్పటికి జగన్ అన్న ఎన్ని చేసిన వైసీపీ పార్టీ నుంచి బయటకు వచ్చినందుకు బాధ పడుతున్న అని చెప్పుకొచ్చారు.