బసవతారకం పాత్రలో ఒదిగిపోయిన విద్యాబాలన్

 

basavatharakam,vidya balanఎన్టీఆర్ బయోపిక్ కోసం తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఎన్నో ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసారు డైరెక్టర్ క్రిష్. అయితే బసవతారకం పాత్రలో విద్యాబాలన్ ఎలా ఉండబోతుందని మాత్రం ఇప్పటి వరకు రివిల్ చెయ్యలేదు. రేపు కథానాయడు , మహానాయకుడి సంబంధించిన ట్రైలర్స్ విడుదల కానున్నాయి. ఇప్పుడు మొదటిసారిగా ఎన్టీఆర్ – బసవతారకం కలిసి ఉన్న ఒక పోస్టర్ ని రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ పోస్టర్ లో బసవతారకం గారు హార్మోనియం వాయిస్తూ వుంటే, ఆ పక్కనే ఎన్టీఆర్ కూర్చుని ఆమె కళ్లలోకి చూస్తున్నట్టుగా వున్న ఈ పోస్టర్, ఎన్టీఆర్ .. బసవతారకం దంపతుల మధ్యగల అనుబంధానికి అద్దం పడుతోంది. బసవతారకం పాత్రలో విద్యాబాలన్ ఒదిగిపోయినట్టుగా అనిపిస్తోంది. ఇక ఈ సినిమా ఆడియో వేడుక హైదరాబాద్ లో గల ఫిలింనగర్ JRC కన్వెన్షన్ లో సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మొదటి భాగాన్ని జనవరి 9 న రిలీజ్ చేయనుండగా , రెండవ భాగాన్ని ఫిబ్రవరి 7 న విడుదల చేయనున్నారు. ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లో ఆణిముత్యాల్లా మిగిలిపోతాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.