రాములమ్మతో రేవంత్ భేటీ అందుకేనా ..!

reventh, vijayshanthi, Telugu Vilas

రాములమ్మతో రేవంత్ భేటీ అందుకేనా

కూటమి అభ్యర్థుల ప్రకటన తాజా పరిస్థితుల నేపధ్యంలో జాప్యం అవుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ ప్రతీ ఒక్కరిలో నెలకొంది. ఎవరికి వారు వరుస మీటింగ్ లు, రహస్య సమావేశాలలో బిజీ బిజీగా ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది అన్న ఆందోళన ఆ పార్టీ కార్యకర్తలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. హైదరాబాద్, ఢిల్లీలలో వరుస సమావేశాలతో ఏం జరుగుతుందో తెలియక అంతా గందరగోళానికి గురవుతున్న పరిస్థితి ఉంది.
అయితే ఒక పక్క రేవంత్ వర్గానికి అన్యాయం జరిగింది అని చర్చ జరుగుతున్న నేపధ్యంలో తాజాగా కాంగ్రెస్ పార్టీ స్టార్ కాంపైనర్ విజయశాంతితో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ కావడం ఆసక్తిని కలిగిస్తుంది. ఇప్పటికే తన వాళ్లకు టిక్కెట్లు ఇవ్వలేదని అలకబూనిన రేవంత్ రెడ్డి, రాములమ్మతో సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు రేవంత్ విజయ శాంతి తో ఎందుకు భేటీ అయ్యారు అన్న విషయంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
రేవంత్ రెడ్డి, విజయశాంతి ఇద్దరు దాదాపు మూడు గంటలపాటు సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. సీట్ల సర్దుబాటు వ్యవహారాన్ని అలాగే మిత్ర పక్ష పార్టీల వ్యవహారాన్ని మహాకూటమికి పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ కు సీట్ల సర్దుబాటు పై వస్తున్న నిరసన జ్వాలలను గురించి మాట్లాడుకున్నారు.

Image result for revanth reddy
కాంగ్రెస్‌లోని అసంతృప్తవాదుల ప్రభావం పార్టీపై పడకుండా తగు చర్యలు తీసుకోవాలని, టీఆర్ఎస్‌ను ఓడించాలన్న లక్ష్యం దెబ్బతినకుండా వ్యూహరచన చేయాలనే అంశాలపై ఇద్దరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తుంది.

Related image
ఇప్పటికే పలుమార్లు విజయశాంతి పార్టీకి మహాకూటమికి పలు సూచనలు చేశారు. మహాకూటమిలో ఇతర పార్టీల ఉనికిని కాపాడుకోవాలని అంతా కలిసి టీఆర్ఎస్ ను ఓడించాలని కోరారు. పార్టీలలో అసంతృప్తి రాకుండా అందరూ ఏకతాటి మీద నడవాలని సూచించారు. మొత్తానికి పార్టీ లో టెన్షన్ నెలకొన్న సమయంలో వీరి భేటీ పై ఆసక్తి నెలకొంది. vijay shanthi revanth reddy lead in telangana congress

Related Posts: — 

హైదరాబాద్ పేరు మార్చాలని ఆ నేత డిమాండ్ చురకలంటించిన రేణుకా చౌదరి

త్వరలో అమరావతిలో భారి బహిరంగ సభ…!

కేసీఆర్ సంచలనం.. అభ్యర్థుల మార్పు లేదు.. అందరికీ 11న బీ ఫామ్స్ ..!

ఆ మహిళా మంత్రికి ఉద్వాసన తప్పదా..?

జ‌న‌సేన‌లో చేరిన కాంగ్రెస్ మాజీ మంత్రి..!