“సరిలేరు నీకెవ్వరు” విజశాంతి ఫస్ట్ లుక్ అవుట్..!

కొద్దిసేపటి క్రితం సరిలేరు నీకెవ్వరూ మూవీ నుండి విజయశాంతి లుక్ ని విడుదల చేశారు. లేత రంగు బట్టలలో కాలుపై కాలేసుకొని కూర్చొని శాసిస్తున్నట్లున్న విజయశాంతి లుక్ రాజసం, పౌరుషం ఉట్టిపడేలా ఉంది. ఈ చిత్రంలో ఆమె ఓ పవర్ ఫుల్ లేడీ రోల్ చేస్తుందని అర్థం అవుతుంది.

విజయశాంతి లాంటి స్టార్ యాక్టర్ కి పర్ఫెక్ట్ కంబ్యాక్ మూవీ సరిలేరు నీకెవ్వరూ అని ఆమె లుక్ చూస్తే అనిపిస్తుంది. ఏదిఏమైనా విజయశాంతి ఫస్ట్ లుక్ మూవీపై అంచనాలు అమాంతం పెంచేసింది. దర్శకుడు అనిల్ రావిపూడి విజయశాంతి కొరకు అద్భుతమైన పాత్రను రూపొందించారనిపిస్తుంది.

ఇక అలాగే మహేష్ హీరోగా, రష్మీక మందాన హీరోయిన్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ ఇతర కీలక పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ అందిస్తున్నారు.