ప్రీ రిలీజ్ కి రంగం సిద్ధం చేసుకున్న రామ్ చరణ్

 

ram charan,vinaya videya ramaమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను , మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన మాస్ ఎంటర్టైనర్ వినయ విధేయ రామ. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని DVV ఎంటర్టైన్మెంట్స్ ఫై డి వి వి దానయ్య నిర్మిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి , టీజర్ కి మంచి రెస్పాన్స్ ఏర్పడింది. రామ్ చరణ్ రంగస్థలం లాంటి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ తరువాత చేస్తున్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ అయిన రెండు పాటలు కూడా బాగా అలరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్లాన్ చేశారు. ఈ నెల 26వ తేదీతో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందట. అందువలన 27వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపాలనే నిర్ణయానికి వచ్చారు. ఆ రోజున సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఇదే వేదికపై ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో, స్నేహా .. ప్రశాంత్ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాతో బోయపాటి , రామ్ చరణ్ కలిసి ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఖాయం అని అభిమానులు నమ్ముతున్నారు.