ఎన్టీఆర్ బయోపిక్‌లో యంగ్ టైగర్ నటించడం లేదు, కానీ…

Ntr Bio Pic, Telugu Vilas
Young Tiger Role In NTR Biopic — ఎన్టీఆర్ బయోపిక్‌లో యంగ్ టైగర్ నటించడం లేదు, కానీ…

తెలుగు ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం దివంగత నటుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్. వచ్చే ఏడాది సంక్రాంతికి రెండు భాగాలుగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో బాలయ్య… లీడ్ రోల్ చేస్తుండగా, రానా, కళ్యాణ్ రామ్, విద్యా బాలన్, రకుల్ ప్రీత్ లాంటి వారు కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతున్నా అఫీషియల్‌గా ఎలాంటి సమాచారం లేదు.

NBK as NTR in Ntr Biopic, Telugu Vilas

ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ తన తండ్రి హరికృష్ణ పాత్ర పోషిస్తుంగా…. జూ ఎన్టీఆర్ యంగ్ బాలయ్యగా కనిపిస్తారని ప్రచారం జరిగింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం యంగ్ టైగర్ పాత్ర విషయంలో ప్లాన్ మారినట్లు తెలుస్తోంది.ఈ బయోపిక్‌లో జూ ఎన్టీఆర్‌‌ ఎలాంటి పాత్ర చేయడం లేదని, ఇందులో ఆయన వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్న విషయం వెలుగులోకి వచ్చింది. సినిమా ప్రారంభంలో ఎన్టీ రామారావు నేప‌థ్యాన్ని వివ‌రిస్తూ యంగ్ టైగర్ వాయిస్ ఓవ‌ర్ అద్బుతంగా ఉండతోతోందట.

Nbk as Ntr in NtrBiopic, Telugu Vilas

యంగ్ బాలయ్యగా జూ ఎన్టీఆర్ నటించడం కంటే…. తాతయ్య నేపథ్యం వివరాస్తూ వాయిస్ ఓవర్ ఇవ్వడమే గొప్పగా ఉంటుందనే అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. తాతయ్య గురించి మనవడు వాయిస్ ఓవర్ చెప్పడం సినిమాపై మంచి ఇంపాక్ట్ చూపుతుందని టాక్.

#Latest News: 

#Photos: — Catherine Tresa Latest Photo Shoot

#Latest Poster: —  న్యూలుక్ లో ఇరగదీస్తున్న ‘సాహో’ ప్రభాస్..!

#Movie News: — అరవిందసమేత ని నిషేదించాల్సిందే … బీజేపీ నేత ….!

                            మహిళలు కూడా రక్తం పీలుస్తారు… శ్రీరెడ్డి షాకింగ్ పోస్ట్, ఆ ఫోటోలో ఎవరు?

                             ‘భైరవ గీత’ విడుదల తేదీ ఖరారు చేసేసిన రామ్ గోపాల్ వర్మ…!

                              స్టేజ్ పై ఎన్టీఆర్ అన్న ఆ ఒక్కమాట చాలు: పరుచూరి

#Political News: — చంద్రబాబు ఒక్కడే అనుకున్న మోడీ కూడా ఉన్నాడా …!

                                తెలంగాణ లో తెలుగుదేశం పోటీచేసే స్థానాలు ఇవే …!

                                హుటాహుటిన లక్నోకు… మాయావతిని కలిసేందుకు వెళ్లిన పవన్ కల్యాణ్!