జన్మదినం నాడు జననేతకు జేజేలు కొడుతున్న అభిమానులు

 

jaganవైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత ఏడాది కూడా తన ప్రజాసంకల్ప యాత్రలోనే పుట్టిన రోజును జనం మధ్యే సాదాసీదాగా జరుపుకున్నారు. ఆ తర్వాత నుంచి ఏడాది కాలంగా జనం మధ్యే ఉన్న ఆ నేత ఇప్పుడు రెండో ఏడాది కూడా ప్రజల సమక్షంలోనే జరుపుకుంటుండడం విశేషంగా చెప్పవచ్చు. వైఎస్ జగన్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఆయన అభిమానులు వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సెలబ్రేషన్లు చేసుకుంటున్నారు. జననేత జనంలోనే తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. వరుసగా రెండో ఏడాది ఈ ఘనత సాధించాడు జిల్లాకేంద్రాలు నియోజకవర్గాల్లో వైసీపీ శ్రేణులు నిన్న అర్ధరాత్రి నుంచే నిర్వహిస్తున్నారు. ఆసుపత్రులు అనాథాశ్రమాల్లో వృద్ధాశ్రమాల్లో ఈరోజున అన్నదానాలు పండ్లు ఇతర దానాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆయన అభిమానులు జగన్ కు శుభాకాంక్షలతో హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం జగన్ శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్రలో ఉన్నారు. జగన్ పుట్టిన రోజు సందర్భంగానే దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై తీస్తున్న ‘యాత్ర’ టీజర్ ను విడుదల చేస్తున్నారు. పాదయాత్రలో ఉన్న జగన్ కు ఈ టీజర్ చూపించనున్నట్టు సమాచారం. వరసగా రెండేళ్లు ప్రజల్లో పుట్టిన రోజు జరుపుకున్న జగన్ వచ్చే ఏడాది ప్రజానాయకుడిగా , ముఖ్యమంత్రిగా పుట్టినరోజు జరుపుకుంటాడని , కార్యకర్తలు , అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.