‘యాత్ర’ సినిమాలో కనిపించనున్న ‘వై.యస్ జగన్’

 

jagan,yatra movie

‘యాత్ర’ దివంగత నేత వైస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా. ఈ సినిమాలో వైస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మమ్మోట్టి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మొత్తం కూడా 2004లో రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్రలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురయ్యాయి అనేది ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు.. ఇటీవలే రిలీజ్ అయినా టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే మాట్లాడిన ప్రతి డైలాగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక వైస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు వైస్ జగన్ పాత్ర కూడా ఈ సినిమాలో అక్కడక్కడా కనిపించనుంది. ఆ పాత్రలో జగన్ నటించాడు అని టాక్ వస్తుంది, మరి నిజంగా జగనే నటించడా లేక ఎవరైనా నటించారా అనేది యాత్ర ‘జగన్’ ఫస్ట్ లుక్ చూస్తే కానీ తెలియదు. మరి జగన్ ఫస్ట్ లుక్ ఎప్పుడు వొదులుతారు అనేది తెలియాల్సి ఉంది. కాగా ఈ సినిమా వచ్చే నెల 8వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.