నూతన గృహప్రవేశం చేసిన జగన్‌

కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని తాడేపల్లిలో నూతనంగా నిర్మించిన ఇంట్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి గృహ ప్రవేశం చేశారు. కుటుంబ సమేతంగా జగన్‌ నూతన గృహంలోకి అడుగు పెట్టారు. జగన్‌ భార్య భారతి, సోదరి షర్మిల, తల్లి విజయమ్మలతో కలిసి జగన్‌ గృహ ప్రవేశం చేశారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నేతలు కూడా పాల్గొన్నారు. ఇంటి సమీపంలోనే వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని నిర్మించారు. మరికాసేపట్లో పార్టీ కార్యాలయాన్ని జగన్‌ ప్రారంభించనున్నారు.